సరిగ్గా ఇంకో నెలలో విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ చేతిలో ఉన్న టైంకు తగ్గట్టు ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. వాయిదా పడితే ఆ డేట్ ని తీసుకుందామని ఎదురు చూస్తున్న రెండు మూడు మీడియం బడ్జెట్ సినిమాలు తప్పుకునే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ హీరో రామ్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ కావడంతో అభిమానుల అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ది వారియర్, స్కంద ఫలితాలు తీవ్రంగా నిరాశ పరిచాక తన మార్కెట్ తిరిగి బలంగా నిలబెట్టేది డబుల్ ఇస్మార్టేననే నమ్మకంతో రామ్ ఉన్నాడు. లైగర్ తర్వాత పూరిది ఇదే పరిస్థితి.
ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కులు సుమారు 60 కోట్లకు డీల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇందులో 6 కోట్లు రిటర్నబుల్ అడ్వాన్స్ గా ఉంటుంది. అంటే రికవరీ కావాలంటే ఖచ్చితంగా గ్రాస్ వంద కోట్లు దాటేయాలి. సంక్రాంతి విజేత హనుమాన్ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వినికిడి. మొత్తం రికవరీ అయ్యాక ఇరవై శాతం కమీషన్ తీసుకునేలా మాట్లాడుకున్నారట. ఇది అధికారిక సమాచారం కాకపోయినా ట్రేడ్ వర్గాల్లో బలంగా తిరుగుతోంది. ఫ్లాప్ హీరో డైరెక్టర్ కాంబోకి ఇంత మొత్తమంటే ఇది ఇస్మార్ట్ శంకర్ ప్రభావమే.
ఇంకొంచెం ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉన్న ఈ మాస్ ఎంటర్ టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ అవతారం ఎత్తాడు. మొదటి భాగానికి మించిన కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయని ఆల్రెడీ వదిలిన రెండు పాటల కంటెంట్ తో అర్థమైపోయింది. ట్రైలర్ లాంచ్ త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. ఆగస్ట్ 15న విక్రమ్ తంగలాన్ తో ప్యాన్ ఇండియా పోటీ పడే సూచనలు ఉండటంతో దానికి తగ్గట్టే పూరి బృందం పబ్లిసిటీని డిజైన్ చేస్తోంది. సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిపోతున్న తరుణంలో పాజిటివ్ టాక్ వస్తే కనక డబుల్ ఇస్మార్ట్ రచ్చ మాములుగా ఉండదు.
This post was last modified on July 16, 2024 12:16 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…