కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన ఒత్తిడిలో ‘క’ అనే వెరైటీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నిజానికి దీని కన్నా ముందు దిల్ రుబా విడుదల కావాల్సి ఉంది. కానీ వరసగా మీటర్, రూల్స్ రంజన్ వేసిన దెబ్బ వల్ల లవ్ ఎంటర్ టైనర్ తో కాకుండా డిఫరెంట్ జానర్ తో వస్తే ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారని భావించి ‘క’ను ముందుకు జరిపాడు. ఇందులో తను హీరో మాత్రమే కాదు నిర్మాతల్లో ఒకడు. బడ్జెట్ భారీగా ఖర్చు పెట్టారు. కెరీర్ లో మొదటిసారి అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ కాబోతున్న మూవీగా ‘క’ కిరణ్ అబ్బవరంకు ప్రత్యేకంగా నిలుస్తోంది.
ఇంకా హీరోగా పూర్తి స్థాయిలో సెటిల్ కాకుండానే ప్యాన్ ఇండియా ప్రయత్నాలు ఏంటనే సందేహం రావడం సహజం. దానికి సంబందించిన ప్రశ్న కిరణ్ అబ్బవరంకు ఎదురయ్యింది. దానికి తగ్గ క్లారిటీతోనే ఉన్నాడు యూత్ హీరో. మంజుమ్మల్ బాయ్స్, కాంతారలు వచ్చినప్పుడు వాటిలో హీరో ఎవరని ప్రేక్షకులు చూడలేదని, కేవలం కంటెంట్ నచ్చడం వల్లే బ్లాక్ బస్టర్ అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ లాజిక్ నిజమే. ఎందుకంటే బలగంలో స్టార్లున్నారని జనం ఎగబడి చూడలేదు కదా. ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకుంటున్న సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో వంద కోట్లు సాధించాడు కదా.
సో సినిమాలో దమ్ముంటే జనం చూస్తారనే నమ్మకం కుర్రాడిది. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో ప్రూవ్ అయ్యింది అదే. తర్వాత వచ్చినవి యావరేజ్, ఫ్లాపులు ఎక్కువ కావడంతో స్పీడ్ తగ్గించాలనే సత్యం బోధపడింది. పోస్టు మాస్టర్ గా ‘క’లో పోషిస్తున్న డిఫరెంట్ క్యారెక్టర్ తనకు పేరుతో పాటు పెద్ద హిట్టు ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు కిరణ్. విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ ఆప్షన్లు చూస్తున్నారు కానీ దేవర, కంగువ, వెట్టయాన్ లాంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండటంతో ఆచితూచి అడుగులు వేయబోతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావాల్సి ఉంది.
This post was last modified on July 15, 2024 6:32 pm
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా చేస్తున్న పోరాటం మరొకరికి ఆదాయం అవుతోంది. అదెలాగో చూడండి. ఇంతకు ముందు…
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కానీ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన తెలివితేటలతో ఒక స్కామర్‌ని…
గ్లామర్ షో చేయకుండా నటననే నమ్ముకుని హీరోయిన్ గా నెగ్గుకురావడం చాలా కష్టం. రెగ్యులర్ పాత్రలకు దూరంగా ఉంటానంటే కెరీర్…
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సీన్ చూస్తే గందరగోళంగా ఉంది. ప్యాసింజర్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు, ఇండిగో కౌంటర్ల ముందు…
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ అధినేత జగన్…