తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకు సైతం ఎంత ప్రేమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘జెంటిల్‌మన్’ మొదలుకుని ‘2.0’ వరకు ఆయన సినిమాలు తమిళంలో ఎంత విజయం సాధించాయో తెలుగులో కూడా అంతే సక్సెస్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకుల నుంచి అత్యంత ఆదరణ పొందిన తమిళ దర్శకుడు ఆయనే అంటే ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి దర్శకుడి నుంచి ‘భారతీయుడు-2’ లాంటి సినిమా రావడం ప్రేక్షకులకు అస్సలు రుచించడం లేదు. ఏ శంకర్ సినిమాకూ రానంత వ్యతిరేకతను ఈ చిత్రం మూటగట్టుకుంది.
పేరుకు ఇది తమిళ సినిమానే కానీ.. అక్కడికంటే తెలుగులోనే దీనికి జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఓపెనింగ్స్ కూడా తమిళం కంటే ఎక్కువ వచ్చాయన్నది ట్రేడ్ పండిట్ల అంచనా. దీన్ని బట్టి శంకర్ మీద మన వాళ్లకు ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంత నమ్మిన దర్శకుడు తన స్థాయికి ఏమాత్రం తగని సినిమా తీయడంతో ప్రేక్షకులు అసహనానికి గురవుతున్నారు.
ఐతే ‘భారతీయుడు-2’ సినిమాను విమర్శకులతో పాటు ప్రేక్షకులు విమర్శిస్తున్నారన్నా.. ట్రోల్ చేస్తున్నారన్నా అది శంకర్ మీద ఉన్న కోపం అనుకోవడానికి లేదు. దాన్ని కోపం కంటే బాధగా భావించాలి. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడు అనే బాధ నుంచే విమర్శలు పుట్టుకొస్తున్నాయి.
శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మన్’కే మనవాళ్లు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో.. ఇలా ప్రతి సినిమానూ మన వాళ్లు నెత్తిన పెట్టుకున్నారు. ‘బాయ్స్’ లాంటి శంకర్ స్థాయికి తగని సినిమాను కూడా తమిళుల కంటే తెలుగు వాళ్లు బాగా ఆదరించారు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘2.0’కు కూడా భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. తమను ఆయా సినిమాలతో శంకర్ ఎంతగా అలరించాడో తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా మరిచిపోలేరు. అత్యున్నత స్థాయి సినిమాలతో ప్రేక్షకుల స్థాయిని కూడా పెంచిన దర్శకుడు శంకర్. అలాంటి మేటి దర్శకుడు ‘భారతీయుడు-2’ లాంటి కంటెంట్ లేని సినిమా ఇచ్చేసరికి ప్రేక్షకులు జీర్ణించుకోలేక తమ అభిమాన దర్శకుడు ఇలా ప్రమాణాలు తగ్గించుకోవడం మీద బాధతో స్పందిస్తున్నారు.
This post was last modified on July 15, 2024 6:10 am
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…