ఆగస్ట్ 15 నుంచి డిసెంబర్ 6కి వాయిదా వేసుకుని కొంచెం రిలాక్స్ అయ్యింది కానీ పుష్ప 2 ది రూల్ కు తీరాల్సిన సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది ఐటెం సాంగ్. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడో రికార్డింగ్ చేసి చేతిలో పెట్టిన ఈ పాట వినగానే ఎక్స్ ట్రాడినరి అనిపించేలా ఉన్నప్పటికీ ఇప్పటిదాకా దర్శకుడు సుకుమార్ దాన్ని తెరకెక్కించలేదు. కారణం అల్లు అర్జున్ పక్కన డాన్స్ చేసే సరైన జోడి దొరక్కపోవడమే. పుష్ప 1 ది రైజ్ లో సమంత ఎంత ప్లస్ అయ్యిందో అభిమానులు మర్చిపోలేదు. కానీ అదే స్థాయిలో హీరోయిన్ తెచ్చి పెట్టడం పెద్ద సవాల్ గా మారిందని అంతర్గత సమాచారం.
ముందు జాన్వీ కపూర్ ని అడిగారట. అయితే టాలీవుడ్ ఎంట్రీని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో చేస్తున్న టైంలో ఇలా స్పెషల్ సాంగ్ చేయడం ఎంత వరకు భావ్యమనే విషయంలో ఆమెతో పాటు తండ్రి బోనీ కపూర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని వినికిడి. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఇమేజ్ ఏమైనా మారితే లేనిపోని చిక్కులొస్తాయి. సామ్ చేసిన టైంలో ఆమె కెరీర్ పీక్స్ చూసేసింది. జస్ట్ మార్పు కోసం ఊ అంటావా ఊహు అంటావా ఆంటూ ఆడిపాడింది. కానీ జాన్వీ కేసు అలా కాదు. ఒకవేళ ఒప్పుకున్నా పారితోషికం భారీగా ముట్టజెప్పాల్సి వస్తుంది కాబట్టి జరిగే పనిలా లేదు.
ఇక ఫహద్ ఫాసిల్ డేట్లు వీలైనంత త్వరగా తీసుకుని అతని పార్ట్ ని పూర్తి చేయడం మరో పెద్ద టాస్క్. ఇప్పటికే జరిగిన విపరీతమైన జాప్యం వల్ల అతను కొంత అసహనంగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. పైగా ఫహద్ చేతిలో ఆరేడు పెద్ద సినిమాలున్నాయి. ఎన్ని అడిగితే అన్ని కాల్ షీట్లు ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇచ్చినప్పుడు వీలైనంత ఎక్కువ షూట్ చేసేయాలి. పైగా కాంబో ఆర్టిస్టులందరూ పెద్ద ఆర్టిస్టులే. ఇంకో అయిదు నెలల సమయమే ఉంది కాబట్టి సుకుమార్ అన్ని డెడ్ లైన్లను చేరుకోవాల్సి ఉంటుంది. ఈసారి వాయిదా ప్రసక్తే ఉండదు. నవంబర్ రెండో వారంలోపు గుమ్మడికాయ కొట్టాల్సిందే.
This post was last modified on July 15, 2024 6:03 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…