చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ అంటే ఫాన్స్ ఉర్రూతలూగిపోయేవారు. మొన్నామధ్య సంక్రాంతికి ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలయ్యాయి. రెండూ హిట్టయినా కానీ పైచేయి మాత్రం చిరంజీవి సాధించారు. కాకపోతే రెండూ మాస్ సినిమాలయితే ఆ క్లాష్ మరింత రసవత్తరంగా వుండేది. అలాంటి రసవత్తర పోటీ జరిగే అవకాశం వుందని ఇప్పుడు వినిపిస్తోంది.
చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని కొరటాల శివ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ చిత్రాన్ని ఏప్రిల్ 30కి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అది సింహా రిలీజ్ డేట్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం కలిసి వస్తుందని ఆ డేట్ అనుకుంటున్నారు కానీ ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తెలీదు.
రెండు చిత్రాలు నవంబర్‍లోనే మళ్లీ సెట్స్కి వెళ్లవచ్చు. దర్శకులు అనుకుంటున్నట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా రెండూ పూర్తయితే మరోసారి ఈ వెటరన్ సూపర్‍స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వద్ద అమీ తుమీ చూడవచ్చు.
This post was last modified on September 23, 2020 7:28 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…