సూపర్ స్టార్ రజినీకాంత్ తెర మీద ఎంత హంగామా చేస్తారో.. బయట అంత సింపుల్‌గా ఉంటారు. ఇండియన్ స్టార్ హీరోల్లో రజినీ అంత సింపుల్‌గా ఇంకెవ్వరూ కనిపించరు అంటే అతిశయోక్తి కాదు. బయట ఆడంబరాలకు పూర్తి దూరంగా కనిపించే రజినీకాంత్.. ఏదైనా వేడుకకు హాజరైనా కూడా సింపుల్‌గానే కనిపిస్తారు, వ్యవహరిస్తారు.
అలాంటి వ్యక్తి ఓ పెళ్లి వేడుకలో చిన్న కుర్రాడిలా డ్యాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పెళ్లి భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ కుటుంబంలోనిదని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని ముకేశ్ కొన్ని రోజులుగా ఎంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారో తెలిసిందే. ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి వందల సంఖ్యలో సెలబ్రెటీలు అతిథులుగా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి కూడా మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్, రానా, అఖిల్ అక్కినేని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం కుటుంబంతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఐతే రజినీ ఈ ఈవెంట్‌కు హాజరవడం వరకు ఓకే కానీ.. ఆయన మిగతా అతిథులతో కలిసి డ్యాన్స్ చేయడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. రజినీ స్వచ్ఛందంగా ఇలా డ్యాన్స్ చేశాడా.. లేక చుట్టూ ఉన్న వాళ్లు బలవంతపెడితే ఇలా చేశారా అన్నది తెలియదు కానీ.. దీని పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపించింది.
కొందరు రజినీ ఉత్సాహాన్ని కొనియాడితే.. చాలామంది సూపర్ స్టార్ స్థాయి వ్యక్తికి ఇలా అంబానీల ఫ్యామిలీ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. డబ్బుంటే ఎవరితో ఏ పనైనా చేయించవచ్చు అనడానికి ఇది ఉదాహరణ అని.. సెలబ్రెటీలను అంబాని షో పీస్‌ల మాదిరి వాడుకుంటున్నాడని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన కూతుళ్ల పెళ్లిలో అయినా రజినీ ఇలా చేశాడో లేదో కానీ.. ఇలా ప్రైవేటు వేడుకలో రజినీ డ్యాన్స్ చేయడం మాత్రం అరుదైన దృశ్యం అనే చెప్పాలి.
This post was last modified on July 13, 2024 6:39 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…