నిన్న విడుదలైన భారతీయుడు 2కి వచ్చిన టాక్ అభిమానులనే కాదు సగటు మూవీ లవర్స్ ని సైతం తీవ్రంగా నిరాశపరిచింది. శంకర్ మీద నమ్మకం, కమల్ హాసన్ మీద గౌరవం వెరసి ఏపీ తెలంగాణలో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగించినా ఇదే ఊపు తర్వాత కొనసాగడం కష్టంగానే ఉంది.
ఇదిలా ఉండగా ఇప్పుడీ ఫలితం రెండో వారంలోకి అడుగు పెట్టిన కల్కి 2898 ఏడికి పెద్ద ప్లస్ కాబోతోంది. కీలకమైన సెకండ్ వీకెండ్ మళ్ళీ ప్రభాస్ కంట్రోల్ లోకి రాబోతోంది. బుక్ మై షో ట్రెండ్ చూస్తే గంటకు ఇండియన్ 2 టికెట్ల కంటే కల్కి 2898 ఏడి టికెట్లే ఎక్కువ అమ్ముడుపోవడం సాక్ష్యం.
ఇదంతా చూస్తున్న అమితాబ్ బచ్చన్ నిన్న సాయంత్రం నుంచి వరసగా కల్కికి సంబంధించిన ట్వీట్లతో ఎక్స్ వేదికను హోరెత్తిస్తున్నారు. అంబానీ ఇంటి పెళ్ళికి వెళ్లి వచ్చాక అలసటగా ఉన్నా సరే ఇంత యాక్టివ్ గా, ఫ్యాన్స్ కి ఉత్సాహం ఇచ్చేలా చాలా సేపు యాక్టివిటీ పెట్టడం ఊహించనిది.
ఒక బాలీవుడ్ వెబ్ సైట్ జూలై 12 సర్ఫిరా, ఇండియన్ 2, కిల్ మూడు సినిమాలకు కలిపి వచ్చిన కలెక్షన్ కంటే కల్కి 2898 ఏడికి ఎక్కువ వసూలు చేసిందని పబ్లిష్ చేసిన ఆర్టికల్ తో సహా ఫ్యాన్స్ వ్యక్తిగతంగా పెట్టిన ట్వీట్లను సైతం అమితాబ్ రీ పోస్ట్ చేయడం గమనార్హం. ఇవన్నీ కలిపి ఇరవైదాకా ఉండటం ఫైనల్ ట్విస్టు.
అశ్వద్ధామగా గత కొన్నేళ్లలో ఎవరూ ఇవ్వని గొప్ప పాత్రను నాగ్ అశ్విన్ ఇవ్వడంతో ఆ ఎగ్జైట్ మెంట్ అమితాబ్ బచ్చన్ నియంత్రించుకోలేక పోతున్నారు. అందుకే వీలైనంత ఎక్కువగా తనవైపు నుంచి ప్రమోషన్లలో భాగమవుతున్నారు. ఆయన కోరుకున్నట్టే సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రికార్డులు బద్దలు కావడం సంతోషాన్ని రెట్టింపు చేసింది.
నిర్మాణ సంస్థ వెయ్యి కోట్ల గ్రాస్ ని అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ ఇతర ట్విట్టర్ హ్యాండిల్స్ పెట్టిన సమాచారాన్ని అమితాబ్ ట్వీట్ చేయడం విశేషం. ఇప్పుడే ఇలా ఉంటే కల్కి రెండో భాగానికి ఇంకే రేంజులో పబ్లిసిటీ చేస్తారో.
This post was last modified on July 13, 2024 6:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…