పంజా బ్రదర్స్ ఎవరనుకుంటున్నారా? చిరంజీవి మేనల్లుళ్లు… సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. పెద్ద మేనల్లుడు ఇంటి పేరు స్క్రీన్ నేమ్‍గా పెట్టుకోలేదు కానీ వైష్ణవ్ మాత్రం న్యూమరాలజీ ప్రకారం ఇంటి పేరు కూడా స్క్రీన్ నేమ్‍కి జత చేసుకున్నాడు. వైష్ణవ్ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా రిలీజ్ కాలేదింకా. ఆ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.
అతను అప్పుడే తన రెండవ చిత్రం మొదలు పెట్టేసాడు. క్రిష్ డైరెక్షన్‍లో ‘కొండ పొలం’ నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో వైష్ణవ్ నటిస్తున్నాడు. కరోనా టైమ్‍లో మిగిలిపోయిన సినిమాల షూటింగ్స్ మాత్రమే అందరూ మొదలు పెడితే ఇతను మాత్రం ఏకంగా కొత్త సినిమా మొదలు పెట్టాడు. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ షూటింగ్ పూర్తి చేసేసాడు.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఈ చిత్రాన్ని జీ 5లో విడుదల చేయబోతున్నారు. కరోనా తగ్గే వరకు ఖాళీగా వుండడం ఇష్టం లేక తేజ్ తన కొత్త సినిమా కూడా మొదలు పెట్టేస్తున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్ అక్టోబర్‍లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే’ నిర్మాతలకే తేజ్ మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడు.
This post was last modified on September 23, 2020 7:16 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…