పంజా బ్రదర్స్ యమ డెడికేషన్‍!

పంజా బ్రదర్స్ ఎవరనుకుంటున్నారా? చిరంజీవి మేనల్లుళ్లు… సాయి ధరమ్‍ తేజ్‍, వైష్ణవ్‍ తేజ్‍. పెద్ద మేనల్లుడు ఇంటి పేరు స్క్రీన్‍ నేమ్‍గా పెట్టుకోలేదు కానీ వైష్ణవ్‍ మాత్రం న్యూమరాలజీ ప్రకారం ఇంటి పేరు కూడా స్క్రీన్‍ నేమ్‍కి జత చేసుకున్నాడు. వైష్ణవ్‍ మొదటి సినిమా ‘ఉప్పెన’ కరోనా కారణంగా రిలీజ్‍ కాలేదింకా. ఆ చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

అతను అప్పుడే తన రెండవ చిత్రం మొదలు పెట్టేసాడు. క్రిష్‍ డైరెక్షన్‍లో ‘కొండ పొలం’ నవల ఆధారంగా రూపొందుతోన్న చిత్రంలో వైష్ణవ్‍ నటిస్తున్నాడు. కరోనా టైమ్‍లో మిగిలిపోయిన సినిమాల షూటింగ్స్ మాత్రమే అందరూ మొదలు పెడితే ఇతను మాత్రం ఏకంగా కొత్త సినిమా మొదలు పెట్టాడు. సాయిధరమ్‍ తేజ్‍ ‘సోలో బ్రతుకే సో బెటర్‍’ షూటింగ్‍ పూర్తి చేసేసాడు.

పోస్ట్ ప్రొడక్షన్‍ పూర్తి చేసి ఈ చిత్రాన్ని జీ 5లో విడుదల చేయబోతున్నారు. కరోనా తగ్గే వరకు ఖాళీగా వుండడం ఇష్టం లేక తేజ్‍ తన కొత్త సినిమా కూడా మొదలు పెట్టేస్తున్నాడు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగ్‍ అక్టోబర్‍లో మొదలు కానుంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేసేలా ప్లాన్‍ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక కొత్త కుర్రాడి దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే’ నిర్మాతలకే తేజ్‍ మరో సినిమా చేయడానికి అగ్రిమెంట్‍ చేసుకున్నాడు.