‘భారతీయుడు-2’ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోని కమల్ హాసన్ అభిమానులు కంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం.. ‘భారతీయుడు-2 తీసిన శంకరే చరణ్‌తో ‘గేమ్ చేంజర్’ తీస్తున్నాడు. ముందుగా ఇండియన్-2 రిలీజ్ కావడంతో ఆ సినిమా ఎలా ఉంటుందో చూసి గేమ్ చేంజర్ ఔట్ పుట్ మీద ఒక అంచనాకు రావాలనుకుంటున్నారు.
ఐతే ఈ రోజు ‘ఇండియన్-2’ రిలీజైపోయింది. ఇది శంకర్ కెరీర్లోనే అట్టడుగున నిలిచే సినిమా అని ముక్తకంఠంతో చెబుతున్నారు ప్రేక్షకులు. శంకర్ కెరీర్లో ఫెయిల్యూర్లు లేవని కాదు. బాయ్స్, ఐ సినిమాలు ఫెయిలయ్యాయి. 2.0 కూడా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వాటిలో శంకర్ మార్కు కనిపిస్తుంది. దర్శకుడిగా ఆయన పూర్తి ఫెయిలయ్యారని చెప్పలేం. కానీ ‘ఇండియన్-2’ అలా కాదు. ఇన్నాళ్లూ శంకర్ సినిమాలను ఎంజాయ్ చేసిన వాళ్లకు ఇది ఆయన సినిమానే అని చెబితే నమ్మలేని పరిస్థితి.
తాను క్రియేట్ చేసిన సేనాపతి కల్ట్ క్యారెక్టర్నే ఈ సినిమాలో ఆయన తేల్చి పడేసిన తీరు ప్రేక్షకులకు పెద్ద షాకే. ఈ సినిమా చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ విషయంలో గుబులు రేగుతూ ఉంటుందనడంలో సందేహం లేదు. శంకర్ ఇదే నైపుణ్యాన్ని చరణ్ సినిమాలో కూడా చూపిస్తే దాని పరిస్థితి ఏం కాను అని కంగారు పడుతున్నారు. శంకర్ దర్శకుడిగా ఇంతగా ఏ సినిమాలోనూ ఫెయిలైంది లేదు. ‘ఇండియన్-2’ చూసిన వాళ్లు ఆయన పనైపోయింది అని తీర్మానించేస్తున్నారు. ‘ఇండియన్-2’ తీస్తున్న సమయంలోనే ఆయన ‘గేమ్ చేంజర్’ కూడా చేసిన నేపథ్యంలో అందులో మాత్రం ఔట్ పుట్ గొప్పగా ఉంటుందా అని సందేహిస్తున్నారు. కాకపోతే ఆ సినిమాకు కథ రాసింది శంకర్ కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథతో శంకర్ ఆ చిత్రం చేశాడు.
ట్రెండీగా ఆలోచించే కార్తీక్.. కథలో తన ప్రత్యేకతను చాటుకునే ఉంటాడని ఆశించవచ్చు. కథల విషయంలో శంకర్ తడబడుతుండొచ్చు కానీ.. మంచి కథ పడితే ఇప్పటికీ ఆయన్నుంచి మెరుపులు చూడొచ్చని అభిమానులు అంటున్నారు. కాబట్టి ‘గేమ్ చేంజర్’ విషయంలో శంకర్ నుంచి భిన్నమైన సినిమా చూడొచ్చేమో అని చరణ్ అభిమానులు ఆశ పడుతున్నారు.
This post was last modified on July 12, 2024 9:15 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…