గత నెల విడుదలైన హరోంహర బాక్సాఫీస్ పరంగా మరీ భారీ విజయం దక్కించుకోలేదు కానీ సుధీర్ బాబు గత చిత్రాలతో పోలిస్తే మెరుగైన ఓపెనింగ్స్, వసూళ్లు తెచ్చిన మాట వాస్తవం. విజయ్ సేతుపతి మహారాజ పోటీ గట్టి దెబ్బే కొట్టింది. అయితే ముందు అనుకున్న ప్రకారమైతే ఈ సినిమా జూన్ 11 అంటే నిన్నటి నుంచే ఓటిటి స్ట్రీమింగ్ జరగాల్సింది. హక్కులు కొన్న ఈటీవీ విన్, ఆహాలు అధికారికంగా పోస్టర్లతో సహా ప్రకటించాయి. అయితే రిలీజ్ జరగలేదు. థియేటర్లో మిస్ అయిన జనాలు ఇంట్లోనే చూద్దామని వెతికితే కనిపించలేదు. వాయిదా పడింది కానీ కారణాలు బయటికి రాలేదు. ఇన్ సైడ్ న్యూస్ ఏంటో చూద్దాం.
హరోంహరలో ఇటీవలే పోక్సోలో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు చిన్న పాత్ర చేశాడు. ఇతని మనస్తత్వం తెలియని దర్శకుడు జ్ఞాన సాగర్ కేవలం ఆన్ లైన్ పాపులారిటీ చూసి వేషం ఇచ్చాడు. తీరా చూస్తే తండ్రి కూతురి వీడియో విషయంలో ఇతను స్నేహితులతో కలిసి లైవ్ లో ప్రవర్తించిన తీరు పట్ల సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుధీర్ బాబు తెలియకుండా ఇతన్ని తీసుకున్నామని ఎక్స్ వేదికగా సారీ చెప్పాడు. విషయం ఏంటంటే అతనున్న భాగాలు తీసేసేలా ఎడిటింగ్ జరుగుతోందట. కథ ఫ్లో ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త వెర్షన్ సిద్ధం చేస్తున్నారట.
అలాగే వదిలేస్తే ఆ వీడియో క్లిప్పులతో సోషల్ మీడియాలో అదే పనిగా కొందరు సినిమా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు కనక దాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఒకవేళ నిజమైతే మాత్రం మంచి నిర్ణయమే. ఎందుకంటే విపరీత ధోరణితో మిడిసిపడే ఇలాంటి వాళ్లకు కేవలం చట్టాలు మాత్రమే కాదు పరిశ్రమ వైపు నుంచి ఎంతటి వ్యతిరేకత ఉందో తెలిసి రావాలి. క్యామియోలకు, ఇంటర్వ్యూలకు పిలిచే ముందు నిర్మాతలు సైతం ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటారు. వచ్చే వారం హరోంహర డిజిటల్ విడుదల జరిగే సూచనలున్నాయి.
This post was last modified on July 12, 2024 5:03 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…