ఫేమ్, సక్సెస్ సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమంటారు. సినీ రంగానికి ఇది మరింత బాగా వర్తిస్తుంది. సక్సెస్ వచ్చాక జాగ్రత్తగా అడుగులు వేయకుంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం విషయంలో ఇదే జరిగింది. రాజావారు రాణివారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించి తనకంటూ ఒక మార్కెట్ కూడా క్రియేట్ చేసుకున్న.. తర్వాత సరైన సినిమాలు చేయక రేసులో వెనుకబడిపోయాడు.
సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, మీటర్, రూల్స్ రంజన్ చిత్రాలు కిరణ్ పేరును బాగా దెబ్బ తీశాయి. ‘రూల్స్ రంజన్’ చూశాక తన అభిమానులు అనుకున్న వాళ్లు కూడా తన మీద నమ్మకం కోల్పోయారు. దీంతో టాలీవుడ్లో కిరణ్ కథ ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తయ్యాయి. కానీ ఫెయిల్యూర్ నుంచి కోలుకోవడానికి, మళ్లీ కెరీర్‌ను గాడిలో పెట్టుకోవడానికి కిరణ్ బాగానే కష్టపడుతున్నాడన్నది సన్నిహిత వర్గాల సమాచారం.
ఇంతకుముందులా హడావుడిగా సినిమాలు ఓకే చేసి కొన్ని నెలల్లో లాగించేసి ప్రేక్షకుల మీదకి వదిలేయడం కాకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు కిరణ్. అతను గ్యాప్ తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘దిల్ రుబా’ అనే లవ్ స్టోరీ ఒకటి కాగా.. మరొకటి పాన్ ఇండియా మూవీ. ఇందులో ‘దిల్ రుబా’ రెగ్యులర్ లవ్ స్టోరీనే కావడంతో రీఎంట్రీ దాంతో ఇవ్వొద్దని భావిస్తున్నాడు. అందుకే పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న పీరియడ్ మూవీని ముందుకు తీసుకొచ్చాడు. దీనికి ‘క’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టి.. వెరైటీ పోస్టర్ వదిలాడు. ఈ నెల 15న కిరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ లాంచ్ కాబోతోంది.
తన మీద ఇండస్ట్రీలోనూ అపనమ్మకం నెలకొన్న నేపథ్యంలో కొందరు ప్రముఖులకు తనను కలిసిన వాళ్లకు ఆ టీజర్ చూపిస్తున్నాడు కిరణ్. అది చూసిన వాళ్లందరూ ఇంప్రెస్ అయి.. కిరణ్ మారిపోయాడని, ఈసారి కచ్చితంగా హిట్ కొట్టేలా ఉన్నాడని అంటున్నారు. దీనికి తోడు కిరణ్ ఇటీవలే సీమ నేపథ్యంలో ఒక థ్రిల్లర్ కథను ఓకే చేసినట్లు సమాచారం. అది ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా అని.. ఆల్రెడీ ఇండస్ట్రీలో కొందరి దగ్గరికి ఆ కథ తిరిగిందని.. అందరూ స్క్రిప్టు విని సూపర్ అన్నప్పటికీ.. కిరణే దానికి ఆమోద ముద్ర వేసి ముందుకు తీసుకెళ్లబోతున్నాడని తెలిసింది.
This post was last modified on July 12, 2024 6:44 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…