Movie News

అఖండ 2లో ఏం చెప్పబోతున్నారు

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీనుల కొత్త మూవీ ఓపెనింగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సింహా, లెజెండ్, అఖండలతో ఒకదాన్ని మించి మరొకటి హ్యాట్రిక్ సాధించిన ఈ కలయిక త్వరలో మరోసారి రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా సినిమాను దసరా లేదా దీపావళి నుంచి మొదలుపెట్టే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న బాలయ్య 109 పూర్తయ్యాక శీనుది సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారు. ఇది అఖండ 2నేని పక్కా సమాచారం.

ఇందులో ఏ అంశాలు ఉంటాయనే దాని మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సీక్వెల్ ప్రధానంగా అఘోరా క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందట. ఎన్నికల ముందు బోయపాటి శీను రాసుకున్న వెర్షన్ లో గత ప్రభుత్వం మీద ఘాటైన సెటైర్లు, ఎపిసోడ్లు ఉన్నాయట. ఎలాగూ టిడిపి కూటమి గెలుస్తుందనే నమ్మకంతో స్క్రిప్ట్ ని పకడ్బందీగా సిద్ధం చేసుకున్నారట. అదే జరిగింది. దీంతో ఒక్క డైలాగు మార్చకుండా యధాతథంగా ఫస్ట్ లాక్ చేసుకున్న కథతోనే ముందుకెళ్లబోతున్నారని తెలిసింది. అఘోరా ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలిసింది.

హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ తో సహా స్టోరీ ప్రకారం బ్రతికి ఉన్న ప్రధాన పాత్రలన్నీ కంటిన్యూ కాబోతున్నాయి. విలన్ గా బాలీవుడ్ నటుడిని వెతికే పనిలో బోయపాటి శీను ఉన్నట్టు తెలిసింది. ప్రతినాయక పాత్రలను చాలా పవర్ ఫుల్ గా రాసుకునే ఈ మాస్ డైరెక్టర్ ఈసారి వయొలెన్స్ ని ఇంకో లెవెల్ లో చూపిస్తారని వినికిడి. స్కంద ఊహించని విధంగా చేదు ఫలితం ఇవ్వడంతో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ 2ని వచ్చే ఏడాది దసరా విడుదలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వేసవిలోగా షూట్ పూర్తి చేయాలనేది బాలయ్య బోయపాటి టార్గెట్.

This post was last modified on July 11, 2024 3:41 pm

Share

Recent Posts

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

14 minutes ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

8 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

8 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

9 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

9 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

10 hours ago