టైటానిక్, అవతార్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ సినిమా గతిని మార్చిన చిత్రాలుగా వీటిని చెప్పొచ్చు. ఆయా సమయాల్లో ప్రపంచ సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసిన ఈ చిత్రాలను గుర్తు చేసుకోగానే అందరికీ జేమ్స్ కామెరూనే గుర్తుకు వస్తారు.
ఐతే దర్శకుడిగా ఇంత భారీ కలలు కని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన కామెరూన్‌కు తెర వెనుక ఉండి అన్నీ సమకూర్చి పెట్టిన వ్యక్తి జాన్ లాండౌ. ప్రముఖ నిర్మాణ సంస్థ పారమౌంట్ పిక్చర్స్ వ్యవస్థాపకుడే జాన్ లాండౌ. టైటానిక్, అవతార్ సహా ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించిన ఆ లెజెండరీ ప్రొడ్యూసర్ ఇక లేరు. 64 ఏళ్ల జాన్ లాండౌ మరణించిన విషయాన్ని ఆయన తనయుడు బుధవారం ప్రకటించాడు.
1960లో జన్మించిన తల్లిదండ్రులు కూడా సినీ నిర్మాతలే. అమెరికన్ ఫిలిం థియేటర్ అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సినిమాలు నిర్మించారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ జాన్ లాండౌ పారామౌంట్ పిక్చర్స్ సంస్థను ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం సాగించారు. ఐతే అంతకుముందు, తర్వాత కూడా ఎన్నో చిత్రాలను నిర్మించినప్పటికీ టైటానిక్, అవతార్ చిత్రాలతో జాన్ లాండౌకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. ఈ చిత్రాల్లో జేమ్స్ కామెరూన్ కూడా నిర్మాణ భాగస్వామే కానీ… ప్రధానంగా నిధులు సమకూర్చింది జాన్ లాండౌనే. ఆయా సమయాల్లో వేరే నిర్మాతలు ఊహించడానికి కూడా భయపడేంత భారీ బడ్జెట్లలో ఈ సినిమాలను ప్రొడ్యూస్ చేసి అందుకు తగ్గట్లు భారీ లాభాలను అందుకోవడమే కాక.. ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు జాన్ లాండౌ.
This post was last modified on July 11, 2024 5:33 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…