అపరిచితుడు, ఐ సినిమాల ద్వారా తెలుగులోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్న చియాన్ విక్రమ్ కు ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కానీ సరైన బొమ్మ పడితే చెలరేగుతాడనే అభిమానుల నమ్మకం ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. పొన్నియిన్ సెల్వన్ కొంత మేర సంతృప్తి పరిచినా మల్టీస్టారర్ కావడం వల్ల ఫుల్ మీల్స్ అనిపించలేదు. అందుకే తంగలాన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కాలా, కబాలి ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరసగా రెండు సినిమాలు చేసిన ట్రాక్ రెకార్డున్న పా రంజిత్ దర్శకత్వం ఆసక్తిని మరింత పెంచింది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేశారు.
దశాబ్దాల క్రితం భారతదేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే తెగలో ఉంటాడు తంగలాన్ (విక్రమ్). అక్కడ బంగారు నిధులు ఉన్నాయని గుర్తించిన ఒక ఇంగ్లీష్ దొర వాటిని తవ్విస్తే కోరినవి ఇస్తానని చెబుతాడు. అమాయకంగా నమ్మిన తంగలాన్ తెగ ప్రజలు దాన్ని వెలికి తీసే పనిలో పడతారు. అయితే ఆరతి అనే కనిపించని దెయ్యం లాంటిది ఆ గనికి రక్షణగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు, వందలాది అమాయకుల ప్రాణాలు పోవడం మొదలవుతుంది. ఆ మాంత్రికురాలు అంతు చూసేందుకు తంగలాన్ సిద్ధపడతాడు. అసలు కథ అదే.
విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. దర్శకుడు పా రంజిత్ ఆలోచనా విధానం, ప్రొడక్షన్ వేల్యూస్ ఆవిష్కరించిన తీరు అబ్బురపరుస్తుంది. ఇక బట్టతలతో ఎప్పుడూ చూడని అటవీ జాతి వీరుడిగా విక్రమ్ పెర్ఫార్మన్స్ గురించి ఈసారి కథలు కథలుగా చెప్పుకుంటారేమో. మాళవిక మోహనన్, పార్వతిలను గుర్తుపట్టని రీతిలో మేకోవర్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతం, కిషోర్ కుమార్ ఛాయాగ్రహణం అద్భుతంగా అనిపిస్తాయి. ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కి హామీ ఇస్తున్న తంగలాన్ వచ్చే నెల విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ లో డేట్ ప్రస్తావించలేదు కానీ ఆగస్ట్ 15 కావొచ్చు.
This post was last modified on July 10, 2024 6:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…