బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ గొప్ప జాతీయ భావాలున్న వ్యక్తిలాగా కనిపిస్తుంటాడు. ‘సత్యమేవ జయతే’ లాంటి మంచి కార్యక్రమంలో తనలోని సామాజిక స్పృహను కూడా చాటుకున్నాడతను. కానీ ఇది ఆమిర్‌లోని ఒక కోణమే. అతడిలో మరో కోణం ఉంది. అప్పుడప్పుడూ ఆమిర్ మాటలు, చర్యలు అనేక సందేహాలకు తావిస్తుంటాయి.
ఇండియాలో ‘అసహనం’ పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అందని కొన్నేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఆమిర్ లాంటి సెలబ్రెటీకి వచ్చిన కష్టం ఏంటో చెప్పాలంటూ అప్పట్లో తటస్థులు కూడా మండిపడ్డారు. కాగా ఇటీవల తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ చిత్ర బృందంతో కలిసి టర్కీకి వెళ్లాడు. అక్కడ టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ భార్య, టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్దోగన్‌ను కలిశాడు.
టర్కీ ప్రధాని పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. విషం కక్కాడు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చాడు. గత ఏడాది ఐక్య రాజ్య సమితిలో కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించిన భారత్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా తెలిసి కూడా ఆమిర్ ఈ మధ్య టర్కీ అధ్యక్షుడి భార్యను కలిశాడు. కనీసం ఆ సందర్భంగా ఆ దేశంలో భారత దౌత్య కార్యాలయానికి సమాచారం కూడా ఇవ్వలేదు. కాగా ఇప్పుడు టర్కీ ప్రధాని మరోసారి భారత్‌ను ఇబ్బంది పెట్టే పని చేశాడు.
తాజాగా ఐరాస సర్వప్రతినిధి సభ వార్షికోత్సవ సమావేశంలో వీడియో సందేశం వినిపిస్తూ కశ్మీర్ అంశాన్ని మళ్లీ లేవనెత్తాడు. భారత్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఇలాంటి వ్యక్తితో ఆమిర్ సంబంధాల కోసం ప్రయత్నించడం మరోసారి అతడికి ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. టర్కీ అధ్యక్షుడి తీరును ఖండించాలని, ఆయన భార్యను కలిసినందుకు క్షమాపణ చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
This post was last modified on September 24, 2020 12:18 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…