ఇప్పుడు ఏదైనా ఓ పెద్ద సినిమా మేకింగ్ దశలో ఉందంటే.. అది ఒక భాగానికి పరిమితం కావడం కష్టంగానే ఉంది. ముందు ఒక సినిమాగా మొదలుపెట్టి తర్వాత రెండు మూడు భాగాలుగా తీస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ఒరవడిని కేజీఎఫ్, పుష్ప సహా చాలా సినిమాలు కొనసాగించాయి. దేవర, సలార్, కల్కి.. ఇలా ఈ జాబితాలో చాలా సినిమాలే కనిపిస్తాయి. ఇప్పుడు మరో భారీ చిత్రం ఈ జాబితాలోకి చేరింది. అదే.. కంగువ.
సూర్య హీరోగా శివ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అదిరిపోయే ప్రోమోలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దసరా కానుకగా అక్టోబరు 10న కంగువను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ ఉన్నట్లు ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని అధికారికంగా అనౌన్స్ చేశాడు.
ఐతే కంగువ-2 మొదలు కావడానికి చాలానే టైం పడుతుందట. వచ్చే ఏడాది చివర్లో కానీ.. 2026 ఆరంభంలో కానీ మొదలై ఇంకో ఏడాది తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందట. కంగువ ప్రోమోలు చూస్తే మాత్రం ఇదొక ఎపిక్ మూవీ అవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శివ ఇప్పటిదాకా రొటీన్ మాస్ మూవీసే చేశాడు కానీ.. కంగువలో మాత్రం మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో ఆశ్చర్యపరిచాడు.
సూర్య నెవర్ బిఫోర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ లాంటి పవర్ ఫుల్ విలన్ నటించాడు. యానిమల్‌తో అతడికి బంపర్ క్రేజ్ వచ్చింది. సూర్య సరసన దిశా పఠాని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. త్వరలోనే కంగువ సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
This post was last modified on July 9, 2024 10:04 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…