టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడి తర్వాత రెండు వారాల గ్యాప్ వచ్చేసింది. మెజారిటీ ఆడియన్స్ థియేటర్లలో చూసేశారు. అందుకే భారీ వసూళ్లు నమోదయ్యాయి. టికెట్ రేట్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో మళ్ళీ వీకెండ్ నుంచి పికప్ ఉంటుంది. జూలై 12 విడుదల కాబోతున్న భారతీయుడు 2ని తెలుగులో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మొదలుపెట్టి ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ కమల్ హాసన్, దర్శకుడు శంకర్, సిద్దార్థ్ తో సహా అందరూ రెండు మూడు రోజులు హైదరాబాద్ లోనే మకాం వేసి బజ్ పెంచే ప్రయత్నం చేశారు. ఇది బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది.
ఓపెనింగ్స్ భారీగా వచ్చినా రాకపోయినా భారతీయుడు 2కి ఓపెనింగ్స్, టాక్ రెండూ చాలా కీలకం. ఎందుకంటే ఇది ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ యాక్షన్ ఉండే రెగ్యులర్ మాస్ మూవీ కాదు. వందేళ్ల వయసున్న వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. సో ఈ శుక్రవారం దీని జాతకం తేలిపోతుంది. ఇక్కడ ప్రియదర్శి ప్రస్తావన ఎందుకంటే జూలై 19న స్ట్రెయిట్ గా రిలీజవుతున్న తెలుగు చిత్రం డార్లింగ్ ఒకటే. నభ నటేష్ హీరోయిన్. పెళ్ళానికి స్పిల్ట్ పర్సనాలిటీ ఉంటే ఏమవుతుందనే పాయింట్ మీద దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించారు. ట్రైలర్ వచ్చాక టీమ్ వినూత్న పబ్లిసిటీ చేస్తోంది.
అంటే జూన్ 27 న నుంచి లెక్కేసుకుంటే అనువాదంగా వస్తున్న భారతీయుడు 2ని మినహాయించి టాలీవుడ్ సినిమా వచ్చి 22 రోజులు అవుతుంది. సో డార్లింగ్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దానికి జరిగిన బిజినెస్ కి త్వరగా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది. పైగా హనుమాన్ నిర్మాత కాబట్టి వాళ్లకున్న డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ మంచి థియేటర్లను తీసుకొస్తుంది. అప్పటికి కల్కి మూడో వారంలోకి అడుగు పెడుతుంది కనక ఆక్యుపెన్సీల్లో తగ్గుదలని బట్టి స్క్రీన్లు కాస్త ఎక్కువగానే డార్లింగ్ దక్కించుకోవచ్చు. రాబోయే పది రోజులు ప్రేక్షకులను తన వైపే తిప్పుకునే పనిలో డార్లింగ్ బృందం చాలా బిజీగా ఉంది.
This post was last modified on July 9, 2024 11:46 am
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…