Movie News

మహేష్ పుట్టినరోజుకి ఏ కానుకలిస్తారు

వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు. గుంటూరు కారం విడుదల తర్వాత బయట ఎక్కువ కనిపించకుండా ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా రాలేదు. బర్త్ డే సందర్భంగా ఒక స్పెషల్ కాన్సెప్ట్ టీజర్ ని సిద్ధం చేయించే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడన్న మాట నిజమే. కానీ ఫైనల్ లుక్ పూర్తి సంతృప్తి ఇస్తే తప్ప ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వరనే సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు ట్రయిల్ షూట్స్ జరిగినా వాటి డీటెయిల్స్ ని గోప్యంగా ఉంచారు.

ఆర్ఆర్ఆర్ తరహాలో ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రాజెక్టు వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారాని అభిమానులు, మీడియా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి కథతో సహా దేన్నీ దాచి పెట్టరు. మొత్తం ఓపెన్ గా చెప్పేసి తెరమీద థ్రిల్ చేయడం ముందు నుంచి ఉన్న అలవాటు. దీనికీ అదే ఫాలో అవ్వొచ్చు. కాకపోతే ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఎలాంటి కానుక ఇస్తారనే ఎగ్జైట్ మెంట్ మూవీ లవర్స్ లో చాలా ఉంది. రెండేళ్లకు పైగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా వీడియో వదలాలనే పట్టు రాజమౌళికి ఉండకపోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నమైతే జరుగుతోంది.

కాసేపు దీని సంగతి పక్కనపెడితే ఖలేజా లేదా మురారి రెండింటిలో ఒకదాన్ని భారీగా రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మురారికి సంబంధించిన 4కె పనులు ఆల్రెడీ పూర్తయ్యాయట. ఖలేజా ఎలాగూ డిజిటల్ ప్రింట్ కాబట్టి పెద్దగా వ్యయ ప్రయాసలు ఉండవు. ఇంకో నెల రోజుల పాటు ఫ్యాన్స్ ఈ రెండు అప్డేట్స్ కి సంబంధించిన సస్పెన్స్ ని భరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఎంత లేట్ అయినా రాజమౌళి సినిమా తప్ప వేరే ఏ కమిట్ మెంట్ లేకుండా మహేష్ బాబు తన డైరీని లాక్ చేసుకోబోతున్నాడు. అది ఎన్ని నెలలు లేదా సంవత్సరాలనేది ఎవరూ చెప్పలేరు.

This post was last modified on July 9, 2024 11:18 am

Share

Recent Posts

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

13 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

17 minutes ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

56 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

4 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

4 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

5 hours ago