ఇండియన్ 2 సినిమా బజ్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎనౌన్స్ చేసినప్పుడు క్రియేట్ చేసిన హైప్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నా కూడా ఇప్పటివరకు సరైన అంచనాలు క్రియేట్ కాలేదు. హిట్ సినిమాకు సీక్వెల్, శంకర్ – కమల్ హాసన్ కాంబో.. అనిరుధ్ మ్యూజిక్ – లైకా వారి భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా అన్ని విషయాల్లో భారీ అంచనాలు క్రియేట్ చేయాల్సిన ఇండియన్ 2 మినిమమ్ సౌండ్ చేయడం లేదు.
ఫైనల్ గా సినిమా కంటెంట్ పైనే ఫలితం ఆధారపడి ఉందని అర్ధమవుతుంది. ఇక దాదాపు ఈ సినిమాకు వర్క్ చేస్తున్న అందరికి కూడా ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే అని చెప్పవచ్చు. ముఖ్యంగా శంకర్ రోబో తరువాత చేసిన సినిమాలన్నీ కూడా అంతగా క్లిక్ కాలేదు. స్నేహితుడు, ఐ, 2.ఓ అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఇండియన్ 2 స్టార్ట్ అయిన మొదట్లోనే ఓ ప్రమాదం జరగడం, ఆ తరువాత లైకా ప్రొడ్యూసర్స్ తో విబేధాలు రావడం సినిమాకు చాలా గ్యాప్ తీసుకొచ్చాయి.
ఇండియన్ 2 కారణంగా గేమ్ ఛేంజర్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండు సినిమాలపై మినిమం బజ్ అయితే లేదు. ఇక ఆయనకు ఇండియన్ 2 సినిమా హిట్టవ్వడం చాలా అవసరం. అలాగే మరోవైపు కమల్ హాసన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది. విక్రమ్ తో ఆయన పర్ఫెక్ట్ అందుకున్నప్పటికి అందులో లోకేష్ పనితనం, మిగతా రోల్స్ సినిమా విజయంలో గట్టిగానే హెల్ప్ చేశాయి. ఇక ఇప్పుడు అంతకంటే బిగ్ సినిమా ఇండియన్ 2, 250 కోట్లు ఖర్చుతో వస్తోంది. కాబట్టి హీరోగా తన స్టార్ ఇమేజ్ ను మరో సారి నిరూపించుకునే సమయం ఆసన్నమైంది.
ఇక మరోవైపు నిర్మాణ సంస్థ లైకా వారికి కూడా ఈ సినిమా మంచి లాభాలు అందించాల్సిన అవసరం ఉంది. గత ఐదేళ్లలో ఈ సంస్థ పెద్ద సినిమాలనే నిర్మించింది. పోన్నీయిన్ సెల్వన్ , దర్బార్, లాల్ సలామ్, మాఫియా, రామ్ సేతు, చంద్రముఖి లాంటి భారీ బడ్జెట్ సినిమాలపై గట్టిగానే పెట్టుబడులు పెట్టింది. కానీ ఏది కూడా అంతగా లాభాలు తీసుకు రాలేదు. ఇక ఇండియన్ 2 తో కాస్త ఆర్థికంగా లాభ పడాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాలో నటించే సిద్ధార్ట్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళకు చాలా.కాలంగా హిట్స్ లేవు. కాబట్టి ఇండియన్ 2 రిజల్ట్ తో వారి లక్కు మారుతుందేమో చూడాలి.
This post was last modified on July 8, 2024 12:10 pm
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…