నెలలు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కదలిక వచ్చింది. నిన్న జరిగిన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు శంకర్ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ని ఓ స్థాయిలో ఎలివేట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఇవాళ ఎస్విసి సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ లో రామ్ చరణ్ బనియన్ వేసుకుని హెలికాఫ్టర్ ముందు నిలబడినట్టుగా ఉన్న వెనుక స్టిల్ ఒకటి రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోయారు. చరణ్ మొహం చూపించకుండా తెలివిగా మేనేజ్ చేశారు.
డిసెంబర్ లో విడుదల ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో గేమ్ ఛేంజర్ టీమ్ ఒక్కసారిగా గేరు మార్చడం ఈ ఏడాది విడుదలవుతుందన్న ఆశాభావాన్ని పెంచుతోంది. రామ్ చరణ్ షెడ్యూల్స్ అన్నీ పూర్తి చేసిన శంకర్ కు ఇంకో పదిహేను రోజుల వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. జూలై 12 ఇండియన్ 2 రిలీజయ్యాక కొంత గ్యాప్ తీసుకుని వేంటనే చరణ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు షిఫ్ట్ అయిపోతారు. తమన్ రీరికార్డింగ్ కి ఎక్కువ సమయం అవసరం కావడంతో వీలైనంత త్వరగా ఫస్ట్ కాపీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఎడిటింగ్ ఈ నెలాఖరు నుంచే మొదలయ్యే ఛాన్స్ ఉంది.
అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ మేరకు డిసెంబర్ 19 ఆప్షన్ గా చూస్తున్నారట. పుష్ప 2 డిసెంబర్ ఆరు వస్తుంది. బాలయ్య 109 అదే నెలలో ప్లాన్ చేస్తున్నారు. తండేల్, రాబిన్ హుడ్ 20 డేట్ మీద కర్చీఫ్ వేశాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దిల్ రాజు టీమ్ డేట్ నిర్ణయించాల్సి ఉంటుంది. తండేల్ ముందే వచ్చే ఛాన్స్ ఉండటం వల్ల ఒక స్లాట్ ఖాళీ అవుతుంది. అయితే పుష్ప 2కి గేమ్ ఛేంజర్ కి కేవలం రెండు వారాల గ్యాప్ సరిపోతుందా లేదనేది డిసైడ్ కావాలి. ప్రస్తుతానికి విడుదల తేదీ నిర్ణయించలేదు కానీ పబ్లిసిటీ వేగం పెంచడం మాత్రం మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్ని కలిగిస్తోంది.
This post was last modified on July 8, 2024 10:33 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…