Movie News

కల్కి.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుందా?

ఏడేళ్ల కిందట ఇండియన్ బాక్సాఫీస్‌లోనే కాక.. ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనే సినిమా రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఇండియన్ సినిమాలో అలాంటి బాక్సాఫీస్ ప్రభంజనం ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఆ తర్వాత కూడా అలాంటి యుఫోరియాను ఇంకే సినిమా కూడా రిపీట్ చేయలేకపోయింది.

ఏడేళ్లు గడుస్తున్నా ‘బాహుబలి’ పేరిట కొన్ని రికార్డులు అలాగే నిలిచి ఉన్నాయి. అందులో యుఎస్‌ఏలో సాధించిన 20 మిలియన్ డాలర్ల రికార్డు ఒకటి. తెలుగు సినిమాలే కాక.. హిందీ చిత్రాలు కూడా ఏవీ ఈ రికార్డును టచ్ చేయలేకపోయాయి.

బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సైతం ఆ రికార్డుకు దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. 20 మిలియన్ సంగతి అలా ఉంచితే 15 మిలియన్ డాలర్ల మార్కును కూడా ఏ ఇండియన్ సినిమా అందుకోలేకపోయింది.

ఐతే ప్రభాస్ సైతం ‘బాహుబలి’ రికార్డులకు ఇప్పటిదాకా చేరువగా కూడా వెళ్లలేకపోయాడు. కానీ ‘కల్కి’ సినిమా మాత్రం యుఎస్‌లో ప్రభంజనం సృష్టిస్తోంది. కొంచెం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చేస్తోంది. ప్రిమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం తొలి రోజే 5.6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ‘కల్కి’.. ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ డాలర్ల క్లబ్బులోకి అడుగు పెట్టేసింది. అంటే భారతీయ కరెన్సీలో వసూళ్లు దాదాపు రూ.120 కోట్లన్నమాట.

ఓ తెలుగు సినిమా యుఎస్‌లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే అసామాన్యమైన విషయం. రెండో వీకెండ్లోనూ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం.. ‘బాహుబలి-2’ రికార్డుకు చేరువగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం రానున్న ‘ఇండియన్-2’కు టాక్ కొంచెం అటు ఇటుగా వస్తే మాత్రం ‘కల్కి’ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నట్లే.

This post was last modified on July 8, 2024 6:55 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

2 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

2 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

3 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

4 hours ago