గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోకపోయినా బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. తొలి వీకెండ్లోనే రూ.500 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు. కానీ అన్ని సినిమాల్లాగే ఇది కూడా వీకెండ్ అయ్యాక డ్రాప్ అయింది. అలా అని వసూళ్లు మరీ పడిపోలేదు. ఓ మోస్తరు కలెక్షన్లతో సినిమా వీక్ డేస్‌లో బండి నడిపించింది. ఐతే ఈ సినిమా మీద బయ్యర్ల భారీ పెట్టుబడుల దృష్ట్యా లాంగ్ రన్ అవసరమైంది. రెండో వీకెండ్లో కూడా సినిమా మంచి ఆక్యుపెన్సీలతో నడిస్తేనే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వచ్చే పరిస్థితి.
ఐతే రెండో వీకెండ్లోనూ కొత్త సినిమాలా జనాలను థియేటర్లకు రప్పించడంలో ‘కల్కి’ విజయవంతమవుతున్నట్లే కనిపిస్తోంది. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి’ థియేటర్లు జనాలతో కళకళలాడాయి.
తొలి వీకెండ్ తర్వాత వీక్ డేస్ ఎలా ఉన్నా.. వీకెండ్ సమయానికి వసూళ్లు పుంజుకుంటాయని తెలుసు. కానీ అనుకున్న దానికంటే ఎక్కువ ఆక్యుపెన్సీలే కనిపిస్తున్నాయి థియేటర్లలో. శనివారం సాయంత్రం, నైట్ షోలకు చాలా థియేటర్లు దాదాపు నిండిపోయాయి. హౌస్ ఫుల్స్ కూడా పడ్డాయి. ఈ విషయంలో టికెట్ల ధరలు సాధారణ స్థాయికి రావడం ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. తొలి వారం సగటున వంద రూపాయల దాకా అదనపు రేటు పెట్టాల్సి రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ వెనుకంజ వేశారు. సినిమా పిచ్చి ఉన్న వాళ్లే తొలి వీకెండ్లో సినిమా కోసం ఎగబడ్డారు.
ఐతే రేట్లు ఎక్కువ ఉన్నాయని వెనుకంజ వేసిన ప్రేక్షకులంతా రెండో వీకెండ్లో నార్మల్ రేట్లతో సినిమా చూసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా అనే టాక్ రావడంతో ‘కల్కి’ని సాధారణ రేట్లతో జనం బాగా చూస్తున్న ట్రెండ్ కనిపిస్తోంది. కాబట్టి రెండో వీకెండ్లో ‘కల్కి’ మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on July 7, 2024 10:19 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…