తన అందాల్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అభిమానుల గుండెల్లో మంటలు రేపే బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆమె నటించిన సినిమాల కంటే కూడా.. సోషల్ మీడియాలో ఆమె చేసే లొల్లే ఎక్కువగా ఉంటుంది. తన అందాల్ని విస్తారంగా ప్రదర్శించే ఆమె.. ఎప్పటికప్పుడు సంచలన స్టేట్ మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పదిహేను రోజుల క్రితం ఆమె పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలుగా ప్రేమించుకున్న సామ్ బాంబే ను ఆమె పెళ్లాడారు. పెళ్లికి సంబంధించిన ఫోటోల్ని ఆమె షేర్ చేశారు. అంతేకాదు.. తమ ఇద్దరి ఎంగేజ్ మెంట్ రింగుల్ని ప్రదర్శించటమేకాదు.. సన్నిహితంగా ఉన్ ఫోటోల్ని పోస్టు చేశారు. ఇద్దరు అన్యోన్యంగా ఎంజాయ్ చేస్తున్నారని అందరు అనుకుంటున్న వేళ.. ఊహించని రీతిలో పోలీసులకు భర్త మీద ఫిర్యాదు చేసింది పూనమ్.
తాజాగా ఒక సినిమా షూటింగ్ కోసం గోవాకు వెళ్లింది ఈ బ్యూటీ. ఏమైందో ఏమో కానీ.. తన భర్త సామ్ తనను వేధిస్తున్నాడంటూ కెనాకోనా గ్రామ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తనపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. పూనమ్ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆమె భర్తను మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం పూనమ్ ను వైద్య పరీక్షలకు పంపారు.
కొన్ని నెలలుగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పూనమ్.. కేవలం పదిహేను రోజులకే కంప్లైంట్ చేశారని ఆరోపించటం.. ఆ వెంటనే అతగాడ్ని పోలీసులు అరెస్టు చేయటం సంచలనంగా మారింది. ఎందుకిలా జరిగిందన్న విషయంపై మరింత స్పష్టత రావాలంటే.. పూనమ్ భర్త సామ్ నోరు విప్పితేనే కానీ తేలదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on September 23, 2020 10:52 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…