సినిమా టైటిల్స్, వాటి దర్శకులను గుర్తు పెట్టుకోవడంలో సాధారణ ప్రేక్షకులు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని వల్ల నిజ జీవితంలో జరిగే సంఘటనలు నవ్వించేలా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. గత ఏడాది తక్కువ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన దర్శకుడు సాయి రాజేష్ కు ఒక విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ఈయన ఫ్రెండ్ ఒకరు అతని ప్రాణ స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళదామని పిలిచారు. ఎందుకయ్యా అంటే సదరు వ్యక్తి బేబీ మూవీకి వీరాభిమాని. యాభైసార్లు పైగానే చూశాడట. సరే ఇంటి ఫుడ్డు తిన్నట్టు ఉంటుందని సాయి రాజేష్ వెళ్లారు.
పలకరింపు ఆతిధ్యాలు అన్నీ అయ్యాయి. అపార్ట్ మెంట్ వాసులు, స్టాఫ్ తదితరులతో సెల్ఫీలు తీయించి గొప్పగా పరిచయం చేశాడు. ఇక భోజనాల సమయంలో సాయి రాజేష్ కి రుచికరమైన పదార్థాలు వడ్డిస్తూహోస్టు ఒక రిక్వెస్ట్ చేశాడు. ఏంటయ్యా అంటే తన కూతురికి సమంత అంటే చాలా ఇష్టమని, ఎలాగైనా ఒక్క ఫోటో దిగే ఏర్పాటు చేయమని. దీంతో అసలు ట్విస్ట్ అప్పుడు అర్థమయ్యింది. అతను అప్పటిదాకా సాయి రాజేష్ ని ఓ బేబీ డైరెక్టర్ అనుకుని ఇన్ని మర్యాదలు చేశాడు. ఎలాగూ దర్శకుడు కాబట్టి ఆమెతో ఫోటో తీయించడం పెద్ద పని కాదనుకుని ఇలా విందుకు పిలిచి మరీ విన్నపం చేసుకున్నాడు.
సరే ఇంత జరిగాక ఏం చేయాలో అర్థం కాక శుభ్రంగా భోజనం చేసి రావడం సాయి రాజేష్ వంతైంది. కేవలం టైటిల్స్ లో ఉన్న ఒక్క అక్షరం వ్యత్యాసం ఇంత పని చేసిందన్న మాట. మరి ఓ బేబీ అసలు దర్శకురాలు నందిని రెడ్డి ఇదంతా చూస్తే ఏమనుకుంటారోనని నెటిజెన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. బేబీ, ఓ బేబీ పేర్లలో సారూప్యత లాగే ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద అలాగే వచ్చింది. రెండు సూపర్ హిట్లే. ఇదంతా సాయి రాజేష్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా షేర్ చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తను ప్రస్తుతం బేబీ హిందీ రీమేక్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.
This post was last modified on July 6, 2024 12:53 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…