ఈ వారం కొత్త రిలీజులు లేకపోవడంతో కల్కి 2898 హవానే కొనసాగనుంది. ఇప్పటికే దాన్ని చూసినవాళ్లు, రిపీట్స్ పూర్తి చేసుకున్న బ్యాచ్ అందరూ భారతీయుడు 2 కోసం ఎదురు చూస్తున్నారు. బజ్ పరంగా విపరీతమైన అంచనాలు లేవు కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం విక్రమ్ సంగతులను గుర్తు చేస్తున్నారు.
ఆ సినిమా సమయంలోనూ హైప్ అంతగా లేదు. హీరో ఇమేజ్ కన్నా లోకేష్ కనగరాజ్ బ్రాండ్ ఎక్కువ పని చేసింది. ఆ కారణంగానే డిస్ట్రిబ్యూషన్ హక్కులను చాలా తక్కువ మొత్తానికి ఇచ్చారు. కట్ చేస్తే విక్రమ్ రైట్స్ కొన్న నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రెట్టింపు లాభాలు కళ్లజూశారు. ఇదంతా గతం.
వర్తమానానికి వస్తే భారతీయుడు 2కు బంగారంలాంటి అవకాశం కళ్లముందుంది. రెండు వారాల బాక్సాఫీస్ గ్యాప్ తో పాటు ఆపై జూలై 19న ప్రియదర్శి డార్లింగ్ లాంటి మీడియం సినిమా తప్పించి పోటీగా ఏమి లేవు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సేనాపతిగా వసూళ్ల భరతం పట్టొచ్చు. దర్శకుడు రన్ టైం 3 గంటల 4 నిమిషాలకు ఫైనల్ చేయడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. 1996లో వచ్చిన మొదటి భాగం నిడివినే దీనికి ఫాలో కావడం సెంటిమెంటో లేక కాకతాళీయంగా ఆలా కుదిరిందో వేచి చూడాలి. దుబాయ్ నుంచి చెన్నై దాకా పబ్లిసిటీ చాలా గ్రాండ్ గా చేసుకుంటూ వచ్చారు.
భారతీయుడు 2 ఫలితం మీదే మూడో భాగం బిజినెస్ ఆధారపడి ఉంది. హిట్ అయ్యిందా దానికి క్రేజ్ వస్తుంది. లేదంటే నష్టాల రికవరీ కింద తక్కువ రేట్లకు అమ్మాల్సి వస్తుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఏపీ, తెలంగాణలో యాభై రూపాయల టికెట్ హైక్ అడిగే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారట. కానీ అంచనాల దృష్ట్యా ఈ మోడల్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయట. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బ్రహ్మానందం, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించిన భారతీయుడు 2కి అనిరుద్ ఇచ్చిన బిజిఎం మీద ప్రత్యేక అంచనాలున్నాయి.
This post was last modified on July 5, 2024 9:16 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…