అదేంటో కొన్ని విషయాల్లో మాస్ మహారాజా రవితేజని మాత్రమే టార్గెట్ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. నిన్న మిస్టర్ బచ్చన్ ఫస్ట్ ఆడియో సింగల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఒక చిన్న వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రొమాన్స్ చేస్తున్న విజువల్స్ ని కొందరు నెటిజెన్లు టార్గెట్ చేసుకుని ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసాన్ని గుర్తు చేయడం గురించి విచిత్రమైన చర్చ జరుగుతోంది. ధమాకా టైంలోనూ రవితేజ, శ్రీలీల జోడి గురించి ఇలాంటి కామెంట్సే వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద చేసిన రచ్చ బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇప్పుడు మిస్టర్ బచ్చన్ కు అదే రిపీట్ చేస్తున్నారు. ఇక్కడో లాజిక్ మిస్ అవ్వకూడదు. స్టార్ హీరోల స్క్రీన్ ప్రెజెన్స్ కు వయసుతో సంబంధం ఉండదు. హీరోయిన్ల విషయంలో ప్రేక్షకులు పరిమితి పెడతారు కానీ తమ అభిమాన కథానాయకులకు కాదు. చిన్నప్పుడు మనవరాలిగా నటించిన శ్రీదేవి అన్న ఎన్టీఆర్ తో వేటగాడులో స్టెప్పులు వేయడం గురించి తొలుత డిబేట్లు జరిగినా తెరమీద జంటను చూశాక నోళ్లు మూతబడ్డాయి. ప్రేమాభిషేకమప్పుడు ఏఎన్ఆర్ సైతం ఈ నెగటివిటీ తట్టుకుని గెలిచినవారే. త్వరలో వెంకటేష్ భార్యగా నటించనున్న ఐశ్వర్య రాజేష్ వయసెంతో చెప్పేదేముంది.
వీరసింహారెడ్డిలో బాలయ్యకు తల్లిగా కనిపించిన హానీ రోజ్, వాల్తేరు వీరయ్యలో చిరుతో ఆడిపాడిన శృతి హాసన్, నా సామిరంగలో నాగ్ సరసన నటించిన ఆశికా రంగనాథ్ ఇలా చెప్పుకుంటూ ఏజ్ డిఫెరెన్సుల గురించి చాంతాడంత లిస్టు తయారవుతుంది. అంతే తప్ప కేవలం ఒక్క రవితేజ మాత్రమే పడుచు హీరోయిన్లతో ఆడిపాడుతున్నాడనే మాట అర్థం లేనిది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మిస్టర్ బచ్చన్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఆగస్ట్ వైపు చూస్తున్నారు కానీ ఇంకా తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ట్రైలర్ తో పాటు అనౌన్స్ మెంట్ రావొచ్చు.
This post was last modified on July 6, 2024 1:16 pm
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్‌కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…