హాలీవుడ్ సినిమాలను మనోళ్లు మక్కీకి మక్కీ దించేయడం ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే మన సినిమా కూడా గ్లోబల్ స్థాయికి చేరడంతో ఇప్పుడు అధికారికంగానే హక్కులు తీసుకుని రీమేక్ చేస్తున్నారు. ఐతే ఒకప్పుడైనా, ఇప్పుడైనా అక్కడి సినిమాలు ఇక్కడికి రావడమే కానీ.. మన కథలు హాలీవుడ్ స్థాయికి వెళ్లడం మాత్రం అరుదే. ఐతే ఇప్పుడో హిందీ యాక్షన్ మూవీ హాలీవుడ్‌లో అధికారికంగా రీమేక్ కాబోతోంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం ఇంకా హిందీలో విడుదలే కాలేదు.
లక్ష్య అనే అప్‌కమింగ్ యాక్టర్‌గా హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని నిఖిల్ నగేశ్ భట్ రూపొందించాడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో అగ్ర నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఏడాది కిందటే పూర్తయిన ‘కిల్’.. నిరుడు టొరంటో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. జులై 5న భారతీయ ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘కిల్’.
కాగా విడుదలకు వారం ముందే ఈ చిత్రానికి ప్రెస్ ప్రీమియర్ షో వేయగా.. చూసిన వాళ్లంతా ఆహా ఓహో అని కొనియాడుతున్నారు. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బెస్ట్ యాక్షన్ మూవీగా నిలుస్తుందంటూ అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో ‘కిల్’ హాలీవుడ్ రీమేక్ గురించి వార్త బయటికి వచ్చింది. ‘జాన్ విక్’ లాంటి మెగా మూవీని ప్రొడ్యూస్ చేసిన మేకర్స్.. ఈ చిత్రాన్ని హాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారట.
ఆర్మీ కమాండో అయిన హీరో.. దుండగుల బారిన పడ్డ తన ప్రియురాలిని కాపాడేందుకు ఒక రైలులో చేసే సాహసాల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలతోనే నిండి ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి యాక్షన్ ఘట్టాలు ఇంతకుముందెన్నడూ చూసి ఉండరని అంటున్నారు మేకర్స్, క్రిటిక్స్. ఇండియాలో రిలీజ్ తర్వాత హాలీవుడ్ రీమేక్ మొదలవుతుందట.
This post was last modified on July 3, 2024 5:46 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…