యూత్ హీరో రాజ్ తరుణ్ సోలోగా హిట్టు కొట్టి చాలా గ్యాప్ వచ్చేసింది. నాగార్జున నా సామిరంగ సక్సెసైనప్పటికీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఈసారి తిరగబడరా సామీగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. గోపీచంద్ యజ్ఞంతో దర్శకుడిగా సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత కొన్ని ఫ్లాపులతో కొంత గ్యాప్ తీసుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి తిరిగి ఈ సినిమాతోనే కంబ్యాక్ అవుతున్నారు. ఇప్పటికే పలు వాయిదాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ ఎంటర్ టైనర్ లో మాన్వీ మల్హోత్రా, మన్నార్ చోప్రా హీరోయిన్లు కాగా జెబి, భోలే శాలిలి సంయుక్తంగా సంగీతం సమకూర్చారు.
ఇవాళ ట్రైలర్ లాంచ్ జరిగింది. కథేంటో గుట్టు దాచకుండా చెప్పేశారు. ఒక మాములు మధ్యతరగతి యువకుడు ఓ అమ్మాయి ప్రేమ వల్ల ప్రమాదకరమైన ఫ్యాక్షనిస్టుతో గొడవలు పడాల్సి వస్తుంది. అప్పటిదాకా ఎవరి మీదైనా చెయ్యి ఎత్తడానికి భయపడేవాడు ఏకంగా పదుల సంఖ్యలో గూండాలతో తలపడాల్సి వస్తుంది. అసలు సాఫ్ట్ గా సౌమ్యంగా ఉండే అబ్బాయి అంత వయొలెంట్ గా ఎందుకు మారాడనే పాయింట్ మీద రూపొందినట్టు కనిపిస్తోంది. రాజ్ తరుణ్ ని బాగా ఓవర్ మాస్ లో చూపించడమే కాక యజ్ఞం స్టయిల్ లో ఫ్యాక్షన్ బిల్డప్ పెట్టడం కొంచెం వెరైటీగానే ఉంది.
ఇప్పటిదాకా రాజ్ తరుణ్ కనిపించని కమర్షియల్ స్కేల్ లో తిరగబడరా సామీని తీశారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయలేదు కానీ ఈ నెలాఖరులోపే ఉండొచ్చు. ఆగస్ట్ లో పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జూలైనే మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నారు. తన ఇమేజ్ కి భిన్నంగా రాజ్ తరుణ్ చేసిన ప్రయోగం, తిరిగి తన మార్కు చాటాలని ప్రయత్నిస్తున్న రవికుమార్ పట్టుదల ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. టీమ్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఖచ్చితంగా అలరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఉయ్యాలా జంపాల, కుమారి 21 ఎఫ్ రేంజ్ సక్సెస్ కోసం రాజ్ తరుణ్ ఎదురు చూస్తున్నాడు.
This post was last modified on July 2, 2024 5:51 pm
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…