పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్లు రేట్ల పెంపు తప్పనిసరైన నేపథ్యంలో నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు చేసుకోవడం మాములే. ఎన్నికల ముందు వరకు ఏపీలో ఉన్న ఇబ్బంది ప్రభుత్వం మారడం వల్ల తొలగిపోవడంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశంలో ప్రొడ్యూసర్లు టెన్షన్ పడాల్సిన పని తప్పిపోయింది. అయితే తెలంగాణ సర్కారు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజానికి ఉపయోగపడే ఒక మెలిక పెట్టడం అన్ని వర్గాల నుంచి మద్దతు దక్కించుకుంటోంది. దాని ప్రకారం ఇకపై వెసులుబాట్లు కోరుకునే నిర్మాతలు ఎవరైనా సరే ఒక నియమం పాటించాలి.
అదేంటంటే సమాజంలో ఎన్నో జీవితాలను ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా వాటి పట్ల అవగాహన కలిగించేలా పెంపులు, షూటింగ్ అనుమతులు కోరుతున్న హీరో హీరోయిన్లు ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో ఏదైనా షూట్ చేసి దాన్ని ప్రత్యేకంగా పోలీస్ శాఖకు అందజేయాలి. దీని వల్ల జనాలకు త్వరగా సందేశం చేర్చడానికి వీలు పడుతుంది. టికెట్లు అధిక ధరలకు అమ్ముకోవడం బడ్జెట్ రికవరీలో భాగమే అయినప్పటికీ తెలంగాణ ప్రజలకు మేలు జరగడం కోసం ఇలాంటి నిబంధన పెట్టాల్సి వచ్చిందని సిఎం స్పష్టం చేయడం విశేషం.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి అలాంటి వీడియో ఒకటి చేయడం గుర్తు చేసి అభినందించారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు ఈ దిశగా కొన్ని యాడ్స్ చేశారు కానీ క్రమం తప్పకుండ ఇవి రావడం లేదు. ఇప్పుడీ కండీషన్ వల్ల థియేటర్లకు పెద్ద ఎత్తున జనాలకు సెలబ్రిటీల ద్వారా చేరాల్సిన సందేశం త్వరగా అందుతుంది. సో టికెట్ రేట్లకు అప్లై చేసే ముందు సామాజిక అవగాహన వీడియో షూట్ చేసుకుని వినతి పత్రంతో పాటు సిడిని అందించేస్తే ఒక పనైపోతుంది. తీసింది ఏ రాష్ట్రం కోసమైనా అది అందరికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు.
This post was last modified on July 2, 2024 4:21 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…