చియాన్ విక్రమ్ కెరీర్ లోనే అత్యద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాల్లో అపరిచితుడుది ప్రత్యేక స్థానం. తమిళంలో కంటే తెలుగులోనే బ్రహ్మాండంగా ఆడిన ఈ బ్లాక్ బస్టర్ కి ఎంత ఫాలోయింగ్ ఉందంటే ఇటీవలే రీ రిలీజ్ చేస్తే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ థియేటర్లు హౌస్ ఫుల్స్ తో సందడి చేశాయి. దర్శకుడు శంకర్ విక్రమ్ లోని నటనని పూర్తిగా తోడేయడంతో పాటు దేశంలో పెరుగుతున్న అవినీతి పరిష్కారానికి చూపించిన మార్గం జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆచరించేందుకు సాధ్యం కాకపోయినా మూవీలోని థ్రిల్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఇక అసలు విషయానికి వద్దాం.
మూడేళ్ళ క్రితం అపరిచితుడుని హిందీలో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చేయాలని శంకర్ ఫిక్సయ్యారు. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించారు. అంత పాత సినిమాని ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీయడమనే కామెంట్స్ బలంగా వినిపించాయి. పైగా ఒరిజినల్ తాలూకు హిందీ డబ్బింగ్ వెర్షన్ ని జనం అప్పటికే విరగబడి చూశారు. అలాంటప్పుడు ఇంకోసారి వేరే హీరోతో చేయడం అంటే రిస్క్. ఈలోగా ఇండియన్ 2 మొదలు కావడం, గేమ్ ఛేంజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల అన్నియన్ రీమేక్ కు బ్రేక్ పడింది. కట్ చేస్తే ఇప్పుడీ ప్రాజెక్టుని పూర్తిగా క్యాన్సిల్ చేసి ఆపేశారు.
ముంబైలో జరిగిన ఒక మీడియా ఇంటర్వ్యూలో శంకర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. నెక్స్ట్ మరో మూడు కథల మీద వర్క్ చేస్తున్నానని, రణ్వీర్ తో ప్లాన్ చేసుకున్న అన్నియన్ చేయబోవడం లేదని చెప్పేశారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది శుభవార్త. ఎందుకంటే విక్రమ్ కాకుండా ఆ పాత్రలో ఇంకెవరిని ఊహించుకోలేం. పైగా దర్శకుడు డిమాండ్ చేసిన దానికన్నా రెండింతలు ఎక్కువ యాక్షన్ చేసి చూపించే రణ్వీర్ సింగ్ తో ఇది పెద్ద సాహసం. అయితే వేరే స్టోరీ మీద భవిష్యత్తులో పని చేస్తామని చెబుతున్నారు. ఏదైతేనేం హిందీ అపరిచితుడుని ఆపేసి బ్రతికించారు.
This post was last modified on July 2, 2024 2:55 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…