కేవలం పదే రోజుల్లో భారతీయుడు 2 విడుదలంటే ఆశ్చర్యం కలుగుతుందేమో కానీ ఇది నిజం. జూలై 12 రిలీజ్ కు తగ్గట్టు ప్రమోషన్లు చేసుకుంటున్న శంకర్ బృందం ఇండియాతో పాటు విదేశాలకు వెళ్లి మరీ పబ్లిసిటీ చేస్తోంది. కమల్ హాసన్ చాలా ఓపిగ్గా ప్రతిచోట తనే వ్యక్తిగతంగా ప్రేక్షకులు, మీడియాతో మాట్లాడుతున్నారు. కానీ కల్కి 2898 ఏడి ప్రభంజనం ఆ సమయానికి తగ్గుతుందా లేదానేది ట్రేడ్ మెదళ్లను తొలిచిపారేస్తోంది. ఎందుకంటే భారతీయుడు 2 హిందీతో సహా అన్ని భాషల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పుడున్న తక్కువ బజ్ ఇలాగే ఉంటే ఓపెనింగ్స్ అద్భుతాలు జరగవు.
ముఖ్యంగా ట్రైలర్ కు వచ్చిన మిశ్రమ స్పందన హైప్ మీద తీవ్ర ప్రభావం చూపించింది. దానికి తోడు అనిరుద్ రవిచందర్ సంగీతం ఏమంత గొప్పగా రీచ్ కాలేదు. గాయం మీద కారం చల్లినట్టు ఏఆర్ రెహమాన్ మొదటి భాగం ఆల్బమ్ తో పోలిక తేవడం మరింత డ్యామేజ్ చేసింది. ఒకవేళ ఆయనతోనే కంపోజ్ చేయిస్తే ఈ సమస్య ఉండేది కాదు. సరే ఇంత పెద్ద క్యాస్టింగ్, వందల కోట్ల బడ్జెట్ ఉన్నా భారతీయుడు 2 వైపు ఆడియన్స్ ఆకర్షితులు కావాలంటే రాబోయే రెండు వందల నలభై గంటల్లో ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లాలి. తెలుగు వెర్షన్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఎప్పుడో 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ కొనసాగింపు కావడం వల్లే ఈ సినిమాకు ఇప్పటి యూత్ అంతగా కనెక్ట్ కాలేకపోతున్నారు. ఫస్ట్ పార్ట్ ని టీవీలో చూసి ఆహా ఓహో అనుకున్నారు తప్పించి సీక్వెల్ కోసం ఎదురు చూసేంత ఎగ్జైట్ మెంట్ దక్కించుకోలేదు. తమిళంలో ఇండియన్ ని అదే పనిగా రీ రిలీజ్ చేస్తే వారం గడిచే లోపే వెనక్కు తిరిగింది. ఈ నేపథ్యంలో భారతీయుడు 2 గురించి మాట్లాడుకునేలా చేయడం అవసరం. ఎలాగూ జూలై 5 శుక్రవారం చెప్పుకునే సినిమాలు లేవు కనక జూలై 12 మంచి అవకాశం. కాకపోతే కల్కి ఫీవర్ తగ్గిపోయి జనాల మూడ్ మారిపోయి ఉండటం చాలా అవసరం.
This post was last modified on July 2, 2024 11:17 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…