ప్రభాస్‍తో నాగ్ అశ్విన్ ఒక అంతర్జాతీయ శ్రేణి సినిమా తలపెట్టిన సంగతి తెలిసిందే. అశ్విన్ ఒక్కసారి కథ చెప్పగానే వెంటనే చేసేస్తున్నా అని మాట ఇచ్చి సినిమా అనౌన్స్ చేసిన ప్రభాస్ ఈ చిత్రం తన పాన్ ఇండియా ఇమేజ్‍ని మరింత పటిష్టం చేస్తుందని నమ్ముతున్నాడు. నాగ్ అశ్విన్ తన సినిమాను పాన్ ఇండియా సినిమా అంటే ఒప్పుకోవడం లేదు.
ఇది పాన్ వరల్డ్ సినిమా అని, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్లు చూసి మెచ్చుకునేలా వుంటుందని అంటున్నాడు. ఇంతకీ ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా టైమ్ మెషీన్ నేపథ్యంలో రూపొందనుందట. అంటే బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబినేషన్‍లో వచ్చిన క్లాసిక్ ‘ఆదిత్య 369’ తరహాలో వుంటుందన్నమాట. టైమ్ మెషీన్ కాన్సెప్ట్ కావడంతో సింగీతం శ్రీనివాసరావుని స్క్రిప్ట్ సలహాదారుగా అశ్విన్ పెట్టుకున్నాడట. నిజానికి సింగీతం ‘ఆదిత్య 999’ అంటూ బాలకృష్ణతో సీక్వెల్ చేద్దామని భావించినా అది కుదర్లేదు.
ఆ సినిమా కోసం పెట్టుకున్న ఐడియాలు అశ్విన్‍తో షేర్ చేసుకుంటున్నారు కావచ్చు. ప్రపంచ స్థాయి గ్రాఫిక్స్తో ఫ్యూచరిస్టిక్ సినిమా ఎలా వుంటుందో నాగ్ అశ్విన్ ఈ సినిమాతో చూపించబోతున్నాడట. ఇందులో కథానాయికగా దీపిక పడుకోన్ నటించనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.
This post was last modified on September 22, 2020 10:51 pm
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…