బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న కల్కి 2898 ఏడి రెండో భాగం గురించి అప్పుడే ఎదురు చూపులు మొదలైపోయాయి. తాజాగా నిర్మాత అశ్వినిదత్ ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేశామని చెప్పడం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దీంతో త్వరగానే చూడొచ్చని ఆశ పడ్డారు.
అయితే ఇక్కడ చాలా ట్విస్టులున్నాయి. చాలా కీలక భాగం ఇంకా షూట్ చేయలేదు. ముఖ్యంగా కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ తాలూకు ఎపిసోడ్లు చిత్రీకరణ చేయాల్సి ఉంది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారం అంత సులభంగా తేలదు. కల్కి మొదటి భాగానికి అక్షరాలా నాలుగు సంవత్సరాలు పట్టింది.
దత్తు గారు చెప్పిన ప్రకారమే కల్కి 2 పూర్తి చేయడానికి ఏడాదిన్నర పడుతుంది. ఆ తర్వాత ఇంకో సంవత్సరం విఎఫెక్స్ గట్రా ఉంటాయి. మధ్యలో ప్రభాస్ ఇతర కమిట్ మెంట్లను ఫినిష్ చేసుకోవాలి. ముందు మారుతీ ది రాజా సాబ్ ఉంది. అటుపై దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉన్నాడు.
యానిమల్ తో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ఏదో ఒక రోజు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వంకు వెళదాం రా అంటాడు. వీటి మధ్యలో కల్కి 2 కోసం ప్రభాస్ డేట్లు సర్దాల్సి ఉంటుంది. ఇదంత ఈజీ కాదు.
ఎలా చూసుకున్నా బాహుబలి తరహాలో కల్కి 2కి ఎంత లేదన్నా ఇంకో రెండేళ్లు పైగానే పడుతుంది. అంటే 2026 కన్నా ముందే చూసే ఛాన్స్ దాదాపు లేనట్టే. పైగా పర్ఫెక్షన్ కోసం తాపత్రయ పడే నాగ్ అశ్విన్ ఫస్ట్ పార్ట్ కు వచ్చిన స్పందనను చాలా నిశితంగా గమనిస్తున్నాడు.
వసూళ్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి కానీ కంటెంట్ పరంగా ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ని ఇంకా బాగా తీసుండాలనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా డీల్ చేస్తాడు. సో ఫ్యాన్స్ రిలాక్స్ అయిపోయి ప్రభాస్ ఇతర సినిమాల మీద దృష్టి పెట్టాలి. అప్పటిదాకా కల్కికి చిన్న బ్రేక్ తప్పదు.
This post was last modified on June 30, 2024 11:12 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…