‘కల్కి’ సినిమాలో ఎన్ని పాత్రలున్నాయో లెక్క పెట్టి చెప్పడం కష్టం. అతిథి పాత్రలు చేసిన వాళ్ల లిస్టే చాలా పెద్దది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ.. ఇలా చాలామంది సినిమాలో తళుక్కున మెరిశారు. క్యారెక్టర్ రోల్స్‌లో కూడా చాలామంది కనిపించారు. ఐతే క్యామియోస్‌లో కొన్ని వర్కవుట్ అయ్యాయి. క్యారెక్టర్ రోల్స్ చేసిన వాళ్లలో కొందరు తమ ప్రాధాన్యాన్ని చాటుకున్నారు.
ఇక ప్రధాన పాత్రలు చేసిన వాళ్లందరూ కూడా తమదైన ముద్ర వేశారు. కానీ ఇందరి మధ్య రాక్సీ పాత్ర చేసిన బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని మాత్రం కనీస స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించలేకపోయింది. ఆమె పాత్ర సినిమాలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు. సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లు వివిధ పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నారు.
కానీ ఎవ్వరూ దిశా పఠాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు. సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్రను ఇష్టపడే అమ్మాయి పాత్రలో తను కనిపించింది. కానీ ఆ రొమాన్స్ వర్కవుట్ కాలేదు. ఇద్దరి మధ్య బంధాన్ని తెలిపేలా సన్నివేశాలు రాసుకోలేదు నాగ్ అశ్విన్. ప్రభాస్-దిశా మీద ఒక పాట తీసినా.. అందులో ఆమె గ్లామరస్‌గా కనిపించినా పెద్దగా ఇంపాక్ట్ లేకపోయింది. ఆ పాట అవ్వగానే దిశ పాత్ర అంతర్ధానం అయిపోతుంది.తర్వాత ఎక్కడా కనిపించదు. అందరూ ఆమెను మరిచిపోతారు.
సినిమా నుంచి బయటికి వచ్చాక దిశగా తలుచుకునేవాళ్లే లేరు. మరోవైపు దీపికా పదుకొనే మాత్రం కీలకమైన పాత్రలో ప్రభాస్‌ను మించి హైలైట్ కావడం విశేషం. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరగడం.. తన పెర్ఫామెన్స్ కూడా బాగుండడంతో మంచి అప్లాజ్ వస్తోంది. దిశాకు మాత్రం ఈ సినిమా వల్ల పైసా ప్రయోజనం లేదనే చెప్పాలి.
This post was last modified on June 29, 2024 6:09 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…