సంవత్సరాల తరబడి భాగ్యనగర సినిమా ప్రేమికుల కల ఒకటి నెరవేరకుండా అలాగే ఉండిపోయింది. అదే ఐమాక్స్. ఒకప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్సులో ఈ తెర ఉండేది కానీ తర్వాత ఏవో కారణాల వల్ల దాన్ని బిగ్ స్క్రీన్ గా మార్చేసి పీసీఎక్స్ గా నామకరణం చేశారు. ఇప్పటికీ మూవీ లవర్స్ హాట్ ఫేవరెట్ ఇదే. బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, కోల్కతా లాంటి ప్రధాన నగరాలు అన్నింటిలో ఉన్న ఐమాక్స్ అతి పెద్ద రెవిన్యూ తెచ్చే హైదరాబాద్ లో లేకపోవడం పెద్ద వెలితి. అంతెందుకు కల్కి 2898 ఏడి లాంటి తెలుగు విజువల్ గ్రాండియర్ ని టాలీవుడ్ ప్రేక్షకులు ఐమాక్స్ అనుభూతి పొందలేకపోయారు.
థియేటర్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు త్వరలో హైదరాబాద్ ఐమాక్స్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయట. పంజాగుట్ట పరిథిలో ఉన్న రెండు పివిఆర్ మల్టీప్లెక్స్ సముదాయాలను ఈ మేరకు పరిశీలిస్తున్నారు. ఏడాది క్రితమే ఈ ప్రతిపాదన మొదలైనప్పటికీ ఎన్నికలు, ప్రభుత్వ మార్పు లాంటి కారణాల వల్ల అక్కడితో ఆపేశారు. ఇప్పుడు అంతా సద్దుమణిగింది కాబట్టి ఐమాక్స్ ప్రతినిధులు సాధ్యాసాధ్యాల గురించి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అన్నీ సవ్యంగా కుదిరితే అతి త్వరలో హైదరాబాద్ నడిబొడ్డున ఒక అద్భుతమైన మూవీ ఎక్స్ పీరియన్స్ ని పొందొచ్చు.
ఖరారు కావడానికి కొంత సమయం పట్టొచ్చు. నైజామ్ మొత్తానికి హైదరాబాద్ నుంచే అత్యధిక వసూళ్లు నమోదవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు నగరం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. అయితే టికెట్ ధరలకు సంబంధించి ఇక్కడ అధికారిక పరిమితులు ఉండటం వల్ల కొన్ని ప్రత్యేక ఫార్మట్ స్క్రీన్లను ఏర్పాటు చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఐమాక్స్ వస్తే 400 లేదా 500 రూపాయల టికెట్ తో పనవ్వదు. కల్కి లాంటివి కనీసం వెయ్యి రూపాయలకు పైగా అమ్మాల్సి ఉంటుంది. ముంబైలో ఇలాగే చేస్తున్నారు. మరి సానుకూలంగా నిర్ణయాలు వెలువడి ఐమాక్స్ వస్తే సినీ ప్రియులకు పండగే.
This post was last modified on June 29, 2024 12:01 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…