విక్టరీ వెంకటేష్ డెబ్యూ దర్శకులకు చాలా అరుదుగా అవకాశాలు ఇస్తుంటారు. కథ, నెరేషన్ బలంగా ఉంటే తప్ప గ్రీన్ సిగ్నల్ రాదు. అలా అందుకున్న వాళ్లలో జయంత్ సి పరాంజీ ప్రేమించుకుందాం రా, తిరుపతి స్వామి గణేష్ సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ తెరంగేట్రం డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక యువ రచయిత వెంకీని మెప్పించాడని ఇన్ సైడ్ టాక్. సామజవరగమనకు రచయితలుగా పని చేసిన వాళ్ళలో నందు ఇటీవలే సురేష్ బాబుతో పాటు వెంకటేష్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నాడని తెలిసింది. స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోందట.
ఇది కార్యరూపం దాలిస్తే మంచిదే. ప్రస్తుతం వెంకటేష్ రానా నాయుడు సీజన్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు సమాంతరంగా మూడో భాగం కూడా తీస్తున్నారనే టాక్ ఉంది కానీ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. జూలై మొదటి వారం దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలవుతుంది. 2025 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో పక్కా ప్లానింగ్ తో అయిదు నెలల్లో పూర్తి చేయబోతున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించబోయే ఈ మూవీలో ఇంకో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. లాంచింగ్ రోజున పూర్తి వివరాలు ప్రకటించబోతున్నారు.
దీని తర్వాత ఫైనల్ వెర్షన్ తో కనక మెప్పిస్తే నందు మెగా ఫోన్ చేపట్టవచ్చు. సీరియస్ జానర్ ని ట్రై చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్న సైంధవ్ తీవ్రంగా నిరాశపరచడంతో వెంకీ తిరిగి ఎంటర్ టైన్మెంట్ వైపు వచ్చేలా చూసుకుంటున్నారు. నందు చెప్పింది కూడా మల్లీశ్వరి తరహాలో పూర్తి వినోదాత్మకంగా ఉంటుందట. సామజవరగమన మరో రచయిత భాను ఇప్పటికే రవితేజతో సితార ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని కొలీగ్ నందు ఇలా ఛాన్స్ పట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు. కంటెంట్ ఉండాలే కానీ ట్రాక్ రికార్డు చూడకుండా స్టార్లు ఆఫర్ ఇవ్వడం స్పష్టమవుతోందిగా.
This post was last modified on June 28, 2024 3:14 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…