మూడేళ్ళ క్రితం 2021 జాతిరత్నాలుతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు కెవి అనుదీప్ పేరు మాములుగా మారుమ్రోగలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ముగ్గురు టాలెంటెడ్ ఆర్టిస్టులతో అతను పండించిన నవ్వులు బాక్సాఫీస్ దగ్గర కోట్లలో కనక వర్షం కురిపించింది. డెబ్యూ మూవీ పిట్టగోడను మర్చిపోయి అందరూ ఇదే అతని తొలి సినిమా అనేంతగా పాపులారిటీ వచ్చింది. తర్వాత తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ నుంచి పిలుపు రావడం, ప్రిన్స్ తెరకెక్కించడం జరిగిపోయాయి. అది ఫ్లాప్ కావడం అనుదీప్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఇదంతా జరిగి రెండు సంవత్సరాలు దాటేసింది.
ఈ మధ్య అనుదీప్ నటుడిగా ఎక్కువ కనిపిస్తున్నాడు. మ్యాడ్, కల్కి 2898 ఏడిలో ఆ దర్శకులు స్నేహితులు కావడంతో చిన్న క్యామియోలు చేశాడు. వీటికి ముందు వేరే దర్శకుడితో తన రచనలో ఫస్ట్ డే ఫస్ట్ షో రాసి పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేసుకుంటే అదేమో సూపర్ ఫ్లాప్ అయిపోయి నిరాశ మిగిలించింది. ప్రస్తుతం అనుదీప్ ఏ హీరోకి కమిట్ కాలేదు. ముందు వెంకటేష్ తో ప్రయత్నించాడు. కుదరలేదు. స్టోరీ లైన్ నచ్చినా ఎందుకో ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు. తర్వాత రవితేజ సానుకూలంగా విన్నాడు. ఇది సితార సంస్థలో ప్లాన్ చేశారు. అఫీషియల్ లాంచ్ జరగలేదు.
చిరంజీవికి ఒక స్టోరీ రెడీ చేస్తే ఆయనకూ పాయింట్ నచ్చిందట కానీ గ్రీన్ సిగ్నల్ వచ్చే దాకా మెగాస్టార్ మూవీకి గ్యారెంటీ ఉండదు. ఇదంతా ప్రిన్స్ ఫలితం ప్రభావమా అంటే చెప్పలేం. అదేమీ మరీ బాలేని సినిమా కాదు. శివ కార్తికేయన్ ఇమేజ్ కి ఆ జోకులు సూటవ్వక జనం రిసీవ్ చేసుకోలేదు. అంతే. ఆ మాత్రానికి ఇంత గ్యాప్ తీసుకోవడం అనుదీప్ లాంటి టైమింగ్ ఉన్న డైరెక్టర్లకు కరెక్ట్ కాదు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు లాక్ చేసుకున్నారు. మరి జాతిరత్నాలు సృష్టికర్తకు ఎవరితో కాంబినేషన్ కుదురుతుందో వేచి చూడాలి మరి.
This post was last modified on June 28, 2024 3:06 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…