ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘కల్కి 2898 ఏడీ’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమాలో కొన్ని లోపాలున్నా.. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఓవరాల్‌గా ఇది మస్ట్ వాచ్ అన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. కేవలం చివరి అరగంట కోసం డబ్బులు పెట్టేయొచ్చన్నది యునానమస్‌గా వినిపిస్తున్న మాట. కాగా ఈ చిత్రాన్ని 3డీలో చూడాలా.. 2డీలో చూడాలా అనే విషయంలో ప్రేక్షకులు కొంచెం అయోమయానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది.
‘కల్కి’ని 3డీలో తీసినా.. ఆ విషయాన్ని టీం ముందు నుంచి అంతగా ప్రచారం చేయలేదు. ప్రమోషన్లలో కూడా ఈ విషయాన్ని టీం నొక్కి వక్కాణించలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక కానీ ‘కల్కి’ 3డీలో కూడా రిలీజవుతున్న విషయం జనాలకు తెలియలేదు. ఇలాంటి విజువల్ వండర్స్‌ను జనం 3డీలో చూడ్డానికే ఇష్టపడతారు.
ఐతే ‘కల్కి’లో కొన్ని త్రీడీ సీన్లు అద్భుతంగా అనిపించినా.. ఓవరాల్‌గా 3డీ వెర్షన్ ఇవ్వాల్సినంత ప్రత్యేక అనుభూతిని ఇవ్వలేదన్నది టాక్. ‘అవతార్’ లాంటి చిత్రాలను త్రీడీలో అనుభూతి చెందాక అదే స్థాయి ఔట్ పుట్ ఆశిస్తారు. కానీ ‘కల్కి’లో త్రీడీ మేకింగ్ ఫుల్ ప్లెడ్జ్‌గా జరిగినట్లు అనిపించలేదు. అక్కడక్కడా మాత్రం 3డీ ఎఫెక్ట్ కనిపించింది. ఆ మాత్రం దానికి నల్ల కళ్లద్దాలు ధరించి మూడు గంటలు సినిమా చూడాలా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
త్రీడీ గ్లాస్‌లు పక్కన పెట్టి 2డీలో బ్రైట్ స్క్రీన్, భారీ విజువల్స్ చూసి పొందే అనుభూతే బాగుంటుందని అంటున్నారు. కొందరు 2డీ, 3డీ రెండూ చూసి రెంటిలో ‘2డీ’నే కంప్లీట్ ఫీలింగ్ ఇచ్చిందని.. 3డీ కోసం పట్టుబట్టి చూడాల్సినంత విషయం లేదని అంటున్నారు. అలా అని మంచి స్క్రీన్లో, బెస్ట్ త్రీడీ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్లలో అవకాశం లభిస్తే వాటిలో చూడ్డం బాగానే ఉంటుంది. అలా కాకుంటే మాత్రం 2డీ చూసినా రిగ్రెట్స్ లేనట్లే.
This post was last modified on June 28, 2024 6:15 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…