Movie News

విజయ్ మీద ఇంత హేట్రెడ్ ఎందుకు?

భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్లో, అత్యంత భారీగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ రోజే ప్రేక్షకులను పలకరించింది. ఇది మా సినిమా అని తెలుగు ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే అంశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. కథాకథనాల్లో కొంచెం ఎత్తుపల్లాలున్నప్పటికీ.. టికెట్ డబ్బులను మించి వినోదాన్ని, నమ్మశక్యం కానీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సినిమా అందిస్తోందనడంలో సందేహం లేదు.

చాలా వరకు సినిమాకు పాజిటివ్ టాకే వస్తోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఎక్కువమంది విమర్శిస్తున్న విషయం.. అర్జునుడిగా విజయ్ దేవరకొండ క్యామియోనే. సినిమాలో అతడి పాత్ర కొంచెం ఆడ్‌గా అనిపించిందని.. అర్జునుడి పాత్రలో తన గెటప్, అలాగే డైలాగ్ డెలివరీ బాలేదని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఐతే విజయ్ అర్జునుడి పాత్రకు సూట్ కాలేదని అని అంటే ఓకే కానీ.. సోషల్ మీడియాలో ఉదయం నుంచి అతడి మీద జరుగుతున్న దాడి మాత్రం ఆక్షేపణీయమే. కేవలం విమర్శించడం కాకుండా.. అతడి మీద అకారణ ద్వేషం చూపిస్తున్నారు చాలామంది. తెలంగాణ టచ్‌తో సాగే విజయ్ స్లాంగ్.. ఏ పాత్ర చేసినా దాంతోకి చొచ్చుకుని వచ్చేస్తుందనే ఒక అభిప్రాయం ఉంది.

‘కల్కి’లో అర్జునుడి పాత్రలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించిందనేది చాలామంది విమర్శ. కానీ ఈ విషయాన్ని మరీ భూతద్దంలో చూపిస్తూ.. విజయ్‌ను అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు. తన వల్లేదో సినిమా మొత్తం చెడిపోయిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఐతే ఈ బ్యాచ్ విజయ్‌ని టార్గెట్ చేయాలని ముందే ఫిక్సయి థియేటర్లలోకి అడుగు పెట్టిందా.. పనిగట్టుకుని సోషల్ మీడియాలో అతడిని డౌన్ చేయాలని చూస్తోందా అనే సందేహాలు కలుగుతున్నాయి సోషల్ మీడియాలో ట్రోలింగ్ డోస్ చూస్తుంటే.  

This post was last modified on June 28, 2024 12:28 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

4 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago