టాలీవుడ్లో కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్.. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి సెటిలైపోయింది. ఇప్పటికీ దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఆమె బేస్ మాత్రం ముంబయే. గత ఏడాది ఆమె తన లాంగ్ టైం బాయ్‌ఫ్రెండ్ నిర్మాత రాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా బడా నిర్మాతలను పెళ్లాడి సెటిలవడం మామూలే. రకుల్ కూడా తన వరుడిని బాగానే సెట్ చేసుకుందని అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి చూసి అయ్యో అనుకుంటున్నారు.
రకుల్ పెళ్లి చేసుకునే సమయానికి రాకీ పరిస్థితి చాలా బాగుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పూజా ఎంటర్టైన్మెంట్స్ అధినేత వశు భగ్నానీ తనయుడే రాకీ. హిందీలో పూజా ఎంటర్టైన్మెంట్ పదుల సంఖ్యలో పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. కానీ ఆ సంస్థకు గత ఏడాది కాలంలో దారుణమైన దెబ్బలు తగిలాయి.
టైగర్ ష్రాఫ్ హీరోగా తీసిన ‘గణ్‌పథ్’ గత ఏడాది పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ఆ సంస్థ నుంచి వచ్చిన ‘బడేమియా చోటేమియా’ ఇంకా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ చిత్రంలోనూ టైగర్ ఒక హీరో. మరో హీరో రోల్ అక్షయ్ కుమార్ చేశాడు. ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల దెబ్బకు పూజా ఎంటర్టైన్మెంట్స్ పునాదులు కదిలిపోయాయి. నష్టాల భర్తీకి వశు ఫ్యామిలీ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. సంస్థలో 80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్ ఇచ్చేశారు. పెద్ద బిల్డింగ్ వదిలిపెట్టి చిన్న ఆఫీస్‌కు మారిందీ సంస్థ.
ఈ పరిణామాలన్నీ చూసి రకుల్ గురించి బాధ పడుతున్నారు ఫ్యాన్స్. పెద్ద నిర్మాతను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైందని అనుకుంటే.. ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడిందేంటి అనుకుంటున్నారు. ఈ సమస్యల నుంచి భగ్నానీ కుటుంబం ఎలా బయటపడుతుందో.. రకుల్ ఈ కష్టాన్ని ఎలా తట్టుకుంటుందో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
This post was last modified on June 26, 2024 2:28 pm
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…