స్టార్ ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సరైన సక్సెస్ లేక వెనుకబడ్డ హీరో అల్లు శిరీష్. అడపాదడపా సినిమాలు చేస్తున్నా ఎక్కువ శాతం ఫ్లాపులు ఉండటంతో గ్యాప్ తీసుకోవాల్సి వస్తోంది. ఊర్వశివో రాక్షసివోకి డీసెంట్ టాక్ వచ్చినా అది కలెక్షన్లలోకి మారకపోవడం విచిత్రం. ఇప్పుడు కొత్తగా బడ్డీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇది కూడా నెలల తరబడి వాయిదా పడిందే కానీ కంటెంట్ బలంగా ఉంటుందని టీమ్ అంటోంది. ఇవాళ ట్రైలర్ లాంచ్ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఇది దేనికీ రీమేక్ కాదని శిరీష్ స్పష్టం చేశాడు. పూర్తిగా కొత్త సబ్జెక్టుతో వచ్చామని అన్నాడు.
కథను దాచకుండా రెండున్నర నిమిషాల వీడియోలో చెప్పేశారు. ఎయిర్ పైలట్ గా పని చేసే ఆదిత్యరామ్ (అల్లు శిరీష్) సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో తన వల్లే నష్టపోయానని చెబుతున్న ఒక విలన్ (అజ్మల్) వల్ల సమస్యలు మొదలవుతాయి. ఎక్కడో దూరంగా కనిపించని చోట ఉండే అతని డెన్ కు ఒంటరిగా వెళ్లే పరిస్థితులు తలెత్తుతాయి. అప్పుడే ఒక నడిచే మాట్లాడే టెడ్డి బేర్ బొమ్మ తోడొస్తుంది. అన్యాయం జరిగితే చాలు అక్కడ ప్రత్యక్షం అయ్యే ఈ బొమ్మ రాకాసిని తీసుకెళ్లిన ఆదిత్య చివరికి మిషన్ ని ఎలా పూర్తి చేశాడనే పాయింట్ తో టెడ్డి రూపొందింది.
దర్శకుడు సామ్ అంటోన్ తీసుకున్న పాయింట్ వైవిధ్యంగానే ఉంది. అరటిపండు ఒలిచినట్టు స్టోరీ మొత్తం రివీల్ చేశారంటే అసలు మ్యాటర్ బలంగా ఉండుండాలి. హిప్ హాప్ తమిజా సంగీతం, విమానం విజువల్స్ లో చూపించిన గ్రాఫిక్స్, మంచి క్యాస్టింగ్ గట్రా చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు భిన్నంగా ఏదో ట్రై చేసిన ఫీలింగ్ అయితే కలుగుతోంది. బ్రదరాఫ్ బన్నీ నుంచి సోలో హీరోగా మార్కెట్ ని సంపాదించుకోవడానికి కష్టపడుతున్న అల్లు శిరీష్ కి టెడ్డి ఎలాంటి బ్రేక్ ఇవ్వనుందో జూలై 26న తేలిపోతుంది. నెల రోజుల ముందే ప్రమోషన్లు మొదలుపెట్టడం విశేషం.
This post was last modified on June 25, 2024 9:22 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…