ఎప్పుడో ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ ని అదే హీరో, దర్శకుడు కలిసి కొనసాగింపు తీయడం ఇండియన్ సినిమా వరకు ఒక్క భారతీయుడు విషయంలోనే జరిగిందని చెప్పాలి. 1996లో ఈ మూవీ రిలీజైనపుడు వచ్చిన స్పందన, కలెక్షన్లు గురించి చెబితే ఒక చరిత్రే అవుతుంది. సేనాపతి పాత్రలో కమల్ హాసన్ విశ్వరూపం, దర్శకుడు శంకర్ హాలీవుడ్ స్థాయి పనితనం వెరసి దాన్నో ఎవర్ గ్రీన్ మాస్టర్ పీస్ గా మార్చేశాయి. ఇన్నేళ్ల తర్వాత భారతీయుడు 2 తిరిగి వెండితెరకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా వదిలిన ట్రైలర్ లో కంటెంట్ ఏంటో క్లుప్తంగా చెప్పారు.
సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ చూస్తూ రగిలిపోయే ఓ యువకుడు (సిద్దార్థ్) వాటిని ఎదురుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తాడు. కానీ అరాచకశక్తులను ఎదిరించేందుకు శక్తి సరిపోదు. దీంతో ఒకప్పుడు లంచగొండులను వణికించి ఇప్పుడు విదేశాల్లో ఉన్న సేనాపతి (కమల్ హాసన్) రావాలని కోరుకుంటాడు. ఇతనే కాదు దేశం మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. వయసు మళ్ళినా సత్తువ తగ్గని సేనాపతి ఇండియాకు వస్తాడు. మాఫియా టైకూన్ (ఎస్జె సూర్య)ని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఇంతకీ సేనాపతి వచ్చిన ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చుకున్నాడనేది తెరమీద చూడాల్సిన స్టోరీ
దర్శకుడు శంకర్ మరోసారి మేజిక్ రిపీట్ చేసినట్టే అనిపిస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రకరకాల గెటప్పుల్లో కమల్ అభినయం నెక్స్ట్ లెవెలనే చెప్పాలి. మర్మకళను పొందుపరుస్తూ మొదటి భాగంలో ఉన్న నడిముడి వేణు లాంటి పాత్రలను ఇందులోనూ కొనసాగించడం శంకర్ పనితనానికి నిదర్శనం. ఎప్పటిలాగే అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఊహించినట్టే క్యాస్టింగ్ మొత్తాన్ని చూపించారు కానీ కాజల్ అగర్వాల్ ని రివీల్ చేయలేదు. జూలై 12 విడుదల కాబోతున్న భారతీయుడు 2 మీద అంచనాలు పెరిగాయి.

This post was last modified on June 25, 2024 9:19 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…