వందలాది కోట్ల ఆస్తి ఉన్నంత మాత్రాన అందరూ స్క్రీన్ మీద హీరోలు కాలేరు. దానికి ఛర్మిష్మా, టాలెంట్, తగిన శిక్షణ అన్ని ఉండాలి. ఇది తప్పని నిరూపించేందుకు తాపత్రయపడిన వ్యక్తి శరవణన్. తమిళనాడు సుప్రసిద్ధ శరవణ స్టోర్స్ అధినేతగా అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యనికి అధిపతి అయిన ఇతను ఆ మధ్య ది లెజెండ్ పేరుతో ఒక ప్యాన్ ఇండియా మూవీని స్వంతంగా నిర్మించి తనే హీరోగా నటించాడు. 80 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చయితే దాంట్లో పావు వంతు కూడా వెనక్కు రాలేదు. పై పెచ్చు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు బలవ్వాల్సి వచ్చింది. తెలుగులోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.
ఇక్కడితో శరవణన్ సినిమా ప్రయత్నాలు ఆగిపోతాయని అందరూ భావించారు. కట్ చేస్తే ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిగా కొత్త మేకోవర్ తో మరో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఇటీవలే గరుడన్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో అతి త్వరలో మరో భారీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. దీని కోసం శరవణన్ చేయించుకున్న ఫోటో షూట్ చూసి అందరూ ఖంగు తిన్నారు. మీసం, గెడ్డం పెంచి చాలా సీరియస్ లుక్స్ తో ఒక మాస్ హీరోకు కావాల్సిన లక్షణాలు ఉన్న రేంజ్ లో స్టిల్స్ ఇవ్వడంతో కంపెనీ ఉద్యోగులే షాక్ తిన్నారు.
ఒకటి మాత్రం మెచ్చుకోవాలి. పడ్డచోటే లేవాలనే సూత్రాన్ని అనుసరించి శరవణన్ చేస్తున్న ఈ సాహసం ఎందరికో స్ఫూర్తినిచ్చేదే. మాస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందబోయే కొత్త సినిమాకు ఈసారి వంద కోట్లకు పైగా కేటాయిస్తారట. హీరోయిన్ తదితర క్యాస్టింగ్ కూడా ఊహించని విధంగా ఉంటుందని చెన్నై టాక్. ఇదంతా ఒక టాలీవుడ్ ఆడియన్స్ గా మనకెందుకంటే సదరు హీరో గారు కేవలం తన మాతృభాషకే పరిమితం కావాలని అనుకోవడం లేదు. ఏక కాలంలో మల్టీలాంగ్వేజెస్ లో విడుదల చేసేలా ప్లాన్ చేయిస్తున్నాడు. మరి ఈసారి ట్రోలింగ్ అవుతుందా లేక ప్రయిజింగ్ అవుతుందా చూడాలి.
This post was last modified on June 24, 2024 12:17 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…