సంగీత దర్శకుడిగా తమిళంలో మంచి పేరున్న సంతోష్ నారాయణన్ ఇండస్ట్రీకి వచ్చి పన్నెండు సంవత్సరాలు దాటింది. కోలీవుడ్ లో విపరీతమైన పోటీని తట్టుకుని తనదైన ముద్రని వేయగలిగాడంటే దానికి కారణం అతనిచ్చే ప్రత్యేకమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. మంచి ఛార్ట్ బస్టర్ పాటలు ఎన్నో ఉన్నాయి కానీ దర్శకుల ఎంపికలో అతని వైపు నుంచి పెద్ద పీఠ తీసుకునేది మాత్రం బీజీఎమ్. నాని దసరాకు అది ఎంత ఉపయోగపడిందో చూశాం. వెంకటేష్ సైంధవ్, యాత్ర 2 నిరాశపరిచినప్పటికీ వాటి కంటెంట్ లో ఉన్న బలహీనతల వల్ల తన నుంచి బెస్ట్ వర్క్ ఆశించడానికి లేకుండా పోయింది.
ఇప్పటిదాకా అతని కెరీర్ లో జరిగింది ఒక ఎత్తు. ఇప్పుడు కల్కి 2898 ఏడికి పని చేయడం మరో ఎత్తు. ఎందుకంటే దీంట్లో సాంగ్స్ కి పెద్దగా ప్రాధాన్యం లేదు. ఏదో ఆడియో మార్కెట్ కోసం మొక్కుబడిగా రెండు మూడు పాటలు పెట్టాడు కానీ దర్శకుడు నాగఅశ్విన్ ఉద్దేశం మాత్రం భారతీయ తెరమీద ఒక గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని. అందుకే కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా హాలీవుడ్ స్టాండర్డ్ లో తెరకెక్కించిన విధానం ట్రైలర్ లోనే బయట పడింది. ఇది థియేటర్లో ప్రేక్షకులకు కనెక్ట్ కావడంలో నేపధ్య సంగీతం పాత్ర చాలా కీలకం. గూస్ బంప్స్ కి ఎక్కడా తగ్గకూడదు.
ప్రాజెక్టు మొదలైనప్పుడు తీసుకున్న మిక్కీ జె మేయర్ ని కాదని సంతోష్ నారాయణన్ ను తీసుకోవడం ద్వారా నాగ అశ్విన్ తీసుకున్నది రిస్క్ అయినా అది తన పనితనం మీదున్న నమ్మకమే. తమన్, దేవిశ్రీప్రసాద్, కీరవాణి, జివి ప్రకాష్, జీబ్రాన్, మణిశర్మ లాంటి ఆప్షన్లు ఉన్నప్పటికీ ఓటు మాత్రం సంతోష్ కే వేశాడు. అంచనాలు కనక అందుకుంటే మాత్రం చరిత్ర లిఖించబోయే ఒక ప్యాన్ ఇండియా మూవీకి పని చేసిన గొప్ప ఘనత దక్కుతుంది. దర్శకుడి విజన్ ని ఏ మాత్రం తగ్గించకుండా ఎలివేట్ చేయడంతో ఇతని పాత్ర చాలా కీలకం. దాన్ని నిలబెట్టుకుంటే అసలు విజేత తనే అవుతాడు.
This post was last modified on June 24, 2024 9:42 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…