Movie News

పిక్ టాక్: మళ్లీ అనసూయ మంటలు

జబర్దస్త్ కామెడీ షో కొన్నేళ్ల పాటు ప్రేక్షకులను ఒక ఊపు ఊపడంలో.. తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఏ కార్యక్రమానికి రానంత ఆదరణ దీనికి రావడానికి కేవలం కామెడీ కామెడీ స్కిట్లు మాత్రమే కారణమే కాదు.

ఆ షోకు అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ అద్దిన గ్లామర్ కూడా దాని విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా అనసూయ ప్రతివారం చేసే గ్లామర్ విందు కోసమే ఈ షోను చూసేవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉండేవాళ్లు.

ఆ షో కోసం సూపర్ సెక్సీగా రెడీ అయ్యే క్రమంలో ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకుంది అనసూయ. ఐతే ఈ షో నుంచి తప్పుకోగానే అనసూయ లైమ్ లైట్‌కు దూరమైంది. సినిమాల్లో నటిస్తున్నా సరే.. జబర్దస్త్‌లో ఉన్నప్పటి స్థాయిలో ఆమె సోషల్ మీడియా జనాలను ఎంగేజ్ చేయలేదన్నది వాస్తవం.

అయినా సరే.. అనసూయ తరచుగా సోషల్ మీడియా కుర్రకారులో సెగలు పుట్టిస్తూనే ఉంటుంది. ఈ మధ్యే ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన సందర్భంగా బికినీలో అనసూయ ఫొటోలు ఇంటర్నెట్‌ను వేడెక్కించిన సంగతి తెలిసిందే.

లేటెస్ట్‌గా అనసూయ ఓ ప్రైవేటు ప్రోగ్రాంలో శారీ లుక్‌లో దర్శనమిచ్చిన తీరు చూసి తన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సూపర్ సెక్సీగా, హాట్‌గా కనిపిస్తున్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి.

కుర్రాళ్లను కవ్వించేలా స్టైలింగ్ చేయించుకోవడంలో హీరోయిన్లు కూడా అనసూయ ముందు దిగదుడుపే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ ఫొటోలు చూసి. ప్రస్తుతం అనసూయ ‘పుష్ప-2’తో పాటు పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఒక టీవీ ఛానెల్ కోసం ఒక కొత్త గేమ్‌ షోలోనూ పాల్గొంటోంది.

This post was last modified on June 23, 2024 5:00 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

28 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago