Movie News

కల్కి కలెక్షన్లు.. పెరుగుతాయా, తగ్గుతాయా?

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి మెగా మూవీస్ తర్వాత టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో ప్రపంచ స్థాయి, ప్రతిష్టాత్మక చిత్రం.. కల్కి 2898 ఏడీ. మామూలుగా రాజమౌళి చిత్రాలకు మాత్రమే ఉండే హైప్‌ను ఈ సినిమా కూడా రాబట్టుకోగలిగింది.

‘మహానటి’తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నాగ్ అశ్విన్.. ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గని స్థాయిలో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సమాధానం అన్నట్లుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. వైజయంతీ మూవీస్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించింది. ప్రోమోలు చూస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు ఏమాత్రం తక్కువగా అనిపించట్లేదీ చిత్రం.

ఈ సినిమా కోసం ఇండియా అంతటా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఐతే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫిక్స్ చేసిన టికెట్ల రేట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్సుల్లో 100 రేటు పెంచేశారు. తెల్లవారుజామున షోలకు ఏకమొత్తంగా రూ.200 అదనపు రేట్ ఫిక్స్ చేశారు. ఏపీలో కూడా దాదాపుగా ఇదే స్థాయిలో రేట్లు ఉంటాయని అంటున్నారు.

‘కల్కి’ లాంటి విజువల్ వండర్‌కు ఎక్కువ డబ్బు పెట్టడానికి రెగ్యులర్ సినీ గోయర్స్ రెడీగానే ఉంటారు. కానీ వారి అంచనాలను కూడా కొత్త రేట్లు మించిపోయాయి. ఇలా రేట్లు పెంచడం వల్ల సినిమాకు కొన్నిసార్లు ప్లస్ అవుతుంది. కొన్నిసార్లు మైనస్ కూడా అవుతుంది.

అదనపు రేట్లు వల్ల ఓపెనింగ్స్ ఊహించని స్థాయిలో వస్తాయి. ఓవరాల్ వసూళ్లు కూడా పెరిగే ఛాన్సుంటుంది. రికార్డులు కూడా బద్దలు కావచ్చు. కానీ ఈ రేట్లు చాలా ఎక్కువ అని ఫీలై థియేటర్లకు వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గనూ తగ్గొచ్చు. ముఖ్యంగా సినిమా టాక్ కొంచెం అటు ఇటు అయితే అధిక ధరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ‘కల్కి’కి టాక్ చాలా కీలకం కానుంది.

This post was last modified on June 23, 2024 4:58 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

29 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago