ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘గేమ్ చేంజర్’ విడుదలకు సంబంధించి ఎప్పట్నుంచో సందిగ్ధత నడుస్తోంది. పలుమార్లు షూటింగ్ ఆగిపోవడం.. వాయిదా పడడం.. షెడ్యూళ్లు తారుమారు కావడంతో ఈ చిత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యంగా విడుదల కాబోతోంది.
ఐతే లేటైతే అయింది.. కనీసం రిలీజ్ ఎప్పుడన్నది అయినా చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని నాన్చుతూనే ఉంది టీం. తన ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమాకూ అన్ని వ్యవహారాలను తన గుప్పెట్లో పెట్టుకుని ఫుల్ క్లారిటీతో ఉండే దిల్ రాజు.. శంకర్ సినిమా అయ్యేసరికి నిమిత్త మాత్రుడిగా మారిపోయాడు.
ఓవైపు అభిమానులు గోల గోల చేస్తుంటే.. ఆయన మౌనవ్రతం పాటించారు. ఐతే ఎట్టకేలకు శంకర్‌తో కమిట్మెంట్ తీసుకుని రిలీజ్ డేట్ విషయంలో రాజు తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ ఏడాది దీపావళికి ‘గేమ్ చేంజర్’ దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. అన్ని రకాలుగా ఆలోచించి ఈ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. టాలీవుడ్‌కు దీపావళి అంత స్పెషలేమీ కాదు.
కానీ బాలీవుడ్, కోలీవుడ్లో దీపావళికి క్రేజీ సినిమాలు రిలీజవుతుంటాయి. ఆయా ఇండస్ట్రీల నుంచి పోటీ ఉన్నా సరే.. దీపావళికే ‘గేమ్ చేంజర్’ను రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట. దసరాకు సినిమాను రెడీ చేయడం కష్టమని.. డిసెంబరుకు వెళ్దామంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఉన్నాయని..అందుకే దీపావళినే బెస్ట్ డేట్ అని టీం ఫిక్సయిందట.
త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ఒకట్రెండు రోజులు షూట్‌లో పాల్గొంటే సరిపోతుందట. మిగతా టాకీ పార్ట్‌ను కూడా త్వరలోనే పూర్తి చేస్తారట. ‘ఇండియన్-2’ రిలీజయ్యాక శంకర్ పూర్తిగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పడిపోతాడు.
This post was last modified on June 23, 2024 4:57 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…