ఎన్నికల ముందు వరకు ఓజి విడుదల ఎప్పుడు, తమన్ పాటలు ఎలా ఉంటాయో, హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందా, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్ హరీష్ శంకర్ ఏమైనా ఇస్తాడా అంటూ ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫలితాలు వచ్చినప్పటి నుంచి దొరుకుతున్న కిక్ అంతా ఇంతా కాదు.
చిరంజీవి ఇంటికి వెళ్లి సంబరం చేసుకోవడం దగ్గరి నుంచి ప్రధాని మోదీ హాజరైన సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం దాకా వాళ్లకు కావాల్సిన ఎన్నో హై మూమెంట్స్ దొరికాయి. వీటికి తోడు అభిమానులు సొంతంగా చేసుకున్న ఎడిట్ వీడియోలు తెగ వైరలవుతున్నాయి.
నిన్నటి నుంచి ఏపీ కొత్త ప్రభుత్వం అసెంబ్లీ కొలువు తీరింది. ఇలాంటి వాటికి సహజంగానే దూరంగా ఉండే సగటు యువత ఈ రోజు మాత్రం సభ కార్యకలాపాలను లైవ్ లో చూసేందుకు సిద్ధమై ఫోన్లు, టీవీల ముందు కాపు కాచుకుని కూర్చుంది.
కారణం పవన్ కళ్యాణ్ ని శాసనసభ గేటు కూడా తాకనివ్వమని గతంలో పలువురు వైసిపి నేతలు చేసిన సవాల్ కు సరైన సమాధానంగా తమ హీరో గర్వంగా అడుగు పెట్టడమే కాక ఉప ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతలు తీసుకోవడం నిన్నంతా తిరిగేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడుని స్పీకర్ గా ఎంచుకున్నాక పవన్ మొదటిసారి ప్రసంగించడంతో ఆసక్తి నెలకొంది.
మాజీ సిఎం జగన్ ని ఉద్దేశించి వాళ్ళ పదకొండు ఎమ్మెల్యేలు పారిపోయారని, విజయం స్వీకరించి ఓటమిని మాత్రం వద్దనుకోవడం పట్ల పవన్ వేసిన సెటైర్లు బాగా పేలాయి. అంతేకాదు స్పీకర్ అయ్యన్నపాత్రుడుని స్కూల్ మాస్టరుతో పోలుస్తూ ఎవరినైనా మందలించాలన్నా అతి చేసే వైవిపి నాయకులు సభలో లేరంటూ పంచులు వేయడం నవ్వులు పూయించింది.
మొత్తానికి గత పద్దెనిమిది రోజులుగా జనసేనాని గెలుపుని ఆస్వాదిస్తున్న అభిమానులకు అసెంబ్లీలో జరుగుతున్న క్లీన్ అండ్ హెల్తీ సినిమా వాళ్లకు కావాల్సిన ఆనందంతో పాటు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచి పెడుతోంద.
This post was last modified on June 22, 2024 6:39 pm
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…