బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత ఏడాది పఠాన్, జవాన్, డంకీ రూపంలో రెండు బ్లాక్ బస్టర్లు, ఒక సూపర్ హిట్ ఇచ్చాక ప్రశాంతంగా రిలాక్సవుతున్నాడు. వీటికి తోడు తన స్వంత టీమ్ కోల్కతా ఐపీఎల్ కప్ గెలవడంతో ఆయన ఆనందం మాములుగా లేదు.
ప్రస్తుతం కూతురు సుహానాను తెరకు పరిచయం చేసే క్రమంలో కింగ్ నిర్మిస్తున్న షారుఖ్ అందులో తాను కూడా నటుడిగా భాగమవుతున్నాడు. అయితే హీరోగా కాదు. కీలకమైన పాత్ర ద్వారా దానికి మార్కెట్ తెచ్చేలా తెలివైన ఎత్తుగడ వేశాడు. ఇదిలా ఉండగా డంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మరోసారి తమ కాంబోని రిపీట్ చేసే ప్లాన్ లో ఉన్నారని ముంబై టాక్.
ఎప్పుడూ ఎమోషన్లకు పెద్ద పీఠ వేసి హిరానీ ఈసారి యాక్షన్, అడ్వెంచర్, దేశభక్తి కలగలసిన ఒక కమర్షియల్ సబ్జెక్టుని సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అందులో హీరోయిన్ గా సమంతా పేరు పరిశీలనలో ఉన్నట్టు బాలీవుడ్ లో వినిపిస్తున్న మాట. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సిటాడెల్ హాన్నీ బన్నీ వెబ్ సిరీస్ పూర్తి చేసిన సామ్ దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకుని స్వంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీలో షారుఖ్ సరసన సూపర్ ప్రమోషన్ కింద లెక్క. జవాన్ లో నయనతార చేయడం తనకు ఎంత ప్లస్ అయ్యిందో చూశాంగా.
ఇది అధికారికంగా తెలియడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి అప్పటిదాకా గాసిప్ గానే చూడాల్సి ఉంటుంది. సామ్ ప్రస్తుతం కథలు వింటోంది కానీ ఎవరికీ వెంటనే ఎస్ చెప్పడం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా తీయబోయే మూవీలో తననే అడిగారనే టాక్ ఉంది కానీ ఎంతవరకు నిజమో అనౌన్స్ చేసేదాకా ఖరారు చేయలేం. ఖుషిలో జోడిగా మెప్పించారు కాబట్టి ఈ ఆప్షన్ అనుకుని ఉండొచ్చు. ఒకపక్క రష్మిక మందన్న సల్మాన్ ఖాన్ తో సికందర్ ఛాన్స్ కొట్టేసింది. మరి షారుఖ్ సరసన చేస్తారా అంటే సమంతా కూడా పెద్ద జాక్ పాట్ కొట్టినట్టే. ఏమవుతుందో చూడాలి మరి.
This post was last modified on June 22, 2024 6:37 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…